Begin typing your search above and press return to search.

అమ్మవారి దర్శనం.. అమ్మాయిలకు స్ట్రిక్ట్ రూల్స్

By:  Tupaki Desk   |   1 Jan 2019 10:37 AM GMT
అమ్మవారి దర్శనం.. అమ్మాయిలకు స్ట్రిక్ట్ రూల్స్
X
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనభాగ్యం ఇక ఎలా పడితే అలా వెళితే కలగదు.. ఇన్నాల్లు ఏదీ వేసుకొని వెళ్లినా దర్శనానికి అనుమతించేవారు. ఇక నుంచి మాత్రం సంప్రదాయ దుస్తులతోనే వెళ్లి దర్శించుకోవాలి.. లేకుంటే మీకు దర్శనం కలుగదు.. ఈ మేరకు కనకదుర్గ ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ ఆదేశాలు జారీ చేశారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల వస్త్రాధారణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వందల ఫిర్యాదుల మేరకు ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఇంద్రకీలాద్రి దర్శనానికి డ్రెస్ కోడ్ ను తప్పనిసరిచేశారు. ఫ్యాషన్ దుస్తులు వేసుకొని వెళితే భక్తులను అనుమతించరు. సంప్రదాయ దుస్తులైన షర్ట్, ప్యాంట్ లేదా పంచె, లుంగీని మగవారు ధరించి వెళ్లాలి. ఇక షాట్స్, స్లీవ్ లెస్ టీ షర్టులు వేసుకొని వెళితే దర్శనానికి అనుమతించరు.

ఇక మహిళలు తప్పనిసరిగా చీర, లంగా ఓణీల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలి. పంజాబీ డ్రెస్ కు అనుమతిచ్చారు. కానీ చున్నీ వేసుకుంటేనే పంజాబీ డ్రెస్ తో వెళ్లవచ్చు. మహిళలు ఫ్యాంట్, షర్టులు వేసుకోవడానికి వీల్లేదని నిబంధనలు పెట్టారు. ఒకవేళ మహిళలు చీర తెచ్చుకోవడం మర్చిపోతే ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక కౌంటర్లో 100 రూపాయలకే చీరలను అందుబాటులో ఉంచారు. వాటిని వేసుకొని వెళ్లవచ్చు. ఇలా ఇంద్రకీలాద్రిలో డ్రెస్ కోడ్ నేటి నుంచి అమలు చేయనున్నారు.