Begin typing your search above and press return to search.

అదిరేటి డ్రెస్ మీరేస్తే.. అది ఆవుపేడతో చేస్తే!

By:  Tupaki Desk   |   18 Sep 2016 10:30 PM GMT
అదిరేటి డ్రెస్ మీరేస్తే.. అది ఆవుపేడతో చేస్తే!
X
ఆవు పేడతో ఏమేమి చేస్తారు? ఇళ్లముందు కళ్లాపి చల్లుతారు, పిడకలు చేస్తారు, గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారా ఇంధనంగా వాడతారు, కాస్త ఎండిన తర్వాత చేలల్లో చల్లుతారు, మొక్కల మొదళ్లలో వేస్తారు... ఇవన్నీ గ్రామాల ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఎవ్వరికైనా తెలిసే విషయమే. అయితే ఆవు పేడతో ఇవన్నీ కాదు, ఏకంగా బట్టలు తయారుచేస్తామని ముందుకొచ్చి.. చేసి చూపించారు జలీల్ ఎసాడీ అనే డిజైనర్.

డెయిరీ ఉత్పత్తులకు పెట్టింది పేరైన నెదర్లాండ్స్‌ కు చెందిన డిజైనర్ జలీలీ ఎసాడీ పాడిపశువుల వ్యర్థాలతో దుస్తులు తయారు చేశారు. ప్రతి ఏడాది విపరీతంగా పెరిగిపోతున్న పాడిపశువుల వ్యర్థాలు నీటిలో కలసిపోయి పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఎసాడీ ప్రతిపాదిస్తున్న వినూత్న మార్గం ఈ పేడ దుస్తులు! పేడలోని సెల్యులోజ్‌ ను కొన్ని రసాయన ప్రక్రియలతో వేరుచేసి బయో పేపర్ - బయోప్లాస్టిక్ - బయో వస్త్రాలుగా మార్చవచ్చని ఎసాడీ నిరూపించింది. ఈ దుస్తులకు ‘మెస్టిక్’ అని నామకరణం చేశారు.. డచ్ భాషలో పేడను మెస్ట్ అంటారు.

ఇక్కడ కనిపించిన ఫొటోలో మోడల్ ధరించింది ఆవుపేడతో తయారైన దుస్తులే! కాగా ఇప్పటికే జూన్‌ లో ఆమె తయారుచేసిన పేడ వస్త్రాలతో ఓ ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు.