Begin typing your search above and press return to search.
తాగడం - ఆడుకోవడమే మా పని..గోవా గవర్నర్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 16 March 2020 10:45 AM GMTరాజకీయ నిరుద్యోగులకు - కురువృద్ధులకు దేశంలో కొన్ని సంస్థలు - పోస్టులను భారత రాజ్యాంగం కల్పించింది. అందులోవే ఎమ్మెల్సీ - రాజ్యసభ - గవర్నర్ వ్యవస్థ. వీటిలో గవర్నర్ల వ్యవస్థ ప్రత్యేకమైనది. రాజ్యాంగంలో కీలకమైన గవర్నర్ వ్యవస్థను కొందరు అభాసు పాలు చేస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న గవర్నర్ గిరిని రాజకీయాలకు తెగ వాడేసుకుంటున్నారు. అవరసమైనప్పుడు కీలక పాత్ర పోషించే గవర్నర్ మిగతా సమయాల్లో గవర్నర్ పదవికి అంతగా పని.. ప్రాధాన్యం ఉండదు. ఐదేళ్ల పాటు గవర్నర్ పదవీ కాలం ఉంటది. కానీ వీరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి బదిలీలు అవుతూనే ఉంటారు.. లేదా ఉద్వాసనకు గురవుతుంటారు. అయితే పాలకపక్షానికి ఎదురు తిరగనంత కాలం పాటు ఆ పదవికి వచ్చిన గండం ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా అధికార పక్షం దృష్టిలో పడ్డారంటే ఇక ఆ పదవిలో కొత్త వారు కనిపించవచ్చు. అయితే గవర్నర్ గా ఉన్నంత కాలం విలాసవంతమైన జీవితం గడుపుతారు. పటిష్టమైన భద్రత.. అధికారిక నివాసం.. రాజభోగాలు అనుభవించవచ్చు. ఇలాంటిదే తాము అనుభవిస్తున్నట్లు ఓ గవర్నర్ బహిరంగంగా వ్యాఖ్యనించారు.
తాము చేసేందుకు పని ఏమీ ఉండదని గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ వాస్తవ విషయమే చెప్పారు. ఇక జమ్ముకశ్మీర్ గవర్నర్ గా ఉంటే మాత్రం వైన్ (మందు) తాగుతూ గోల్ఫ్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారని తెలిపారు. ఈ విషయం తాను గతంలో జమ్ము కశ్మీర్ గవర్నర్ గా ఉండడంతో తెలిసిందని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన గవర్నర్ వ్యవస్థపై ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ‘మన దేశంలో గవర్నర్లకు పనీపాటా ఏమీ ఉండదు. జమ్ము కశ్మీర్ గవర్నర్ అయితే సాధారణంగా వైన్ తాగుతూ గోల్ఫ్ ఆడుతూ సేద తీరుతుంటారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు మాత్రం వివాదాలకు దూరంగా ఉంటారు’ అని బహిరంగం ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవి గవర్నర్ వ్యవహారంపై ఒక గవర్నరే ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్రం కూడా గమనించిందని సమాచారం. త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.