Begin typing your search above and press return to search.
డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్ లింకేజీ తప్పనిసరి
By: Tupaki Desk | 15 Sep 2017 12:46 PM GMTసర్వం ఆధార్ మయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మరో కీలక పరిణామం చేసుకోనుంది. ఆధార్ ను డ్రైవింగ్ లైసెన్సులతో అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఆధార్ ను డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేస్తారనే విషయాన్ని ఆయన ప్రకటించలేదు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017ను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తో ఆధార్ కార్డును అనుసంధానం అమలు చేయనున్నట్టు చెప్పారు.
ఆధార్ తో డ్రైవింగ్ లైసెన్స్‌లను అనుసంధానించే విషయమై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తాను ఇప్పటికే సూత్రప్రాయంగా చర్చించానని రవిశంకర్ చెప్పారు. త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం వెలువడనున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా, ఆధార్ పై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. వ్యక్తిగత గోప్యతను ఆధార్ ఉల్లంఘిస్తుందా అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఆధార్‌పై విచారణ సందర్భంగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల్లోకి వస్తుందా అనే అంశంపై విచారణ జరిపి అది ప్రాథమిక హక్కేనని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అనుసంధానం గురించి ప్రకటించడం గమనార్హం.