Begin typing your search above and press return to search.

డ్రైవింగ్ లైసెన్స్ - ఆర్‌ సీ రూల్స్‌ మార్పు..కేంద్రం మరో కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   6 Jun 2020 2:30 AM GMT
డ్రైవింగ్ లైసెన్స్ - ఆర్‌ సీ రూల్స్‌ మార్పు..కేంద్రం మరో కీలక నిర్ణయం !
X
వైరస్ ను అరికట్టడానికి విధించిన ఈ లాక్ డౌన్ వల్ల దేశంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ‌కు సంబంధించిన నిబంధనలు కూడా మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు చేస్తోంది. మోటార్ వెహికల్ చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. అందుకే పరిశ్రమ వర్గాలు, ఇతరుల నుంచి సలహాలు, సూచనలు కోరుతోంది.

మోదీ సర్కార్ వచ్చే కొన్ని నెలల్లో కొత్త మార్పులను అమలులోకి తీసుకురావొచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వపు నోటిఫికేషన్ ప్రకారం.. ఒక వాహనంలో లోపాలు ఉంటే.. అప్పుడు దాన్ని తయారు చేసిన కంపెనీపై జరిమానా మరింత పెరుగుతుంది. ఈ పెనాల్టీ రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చు. జరిమానా మొత్తం వెహికల్ రకం, లోపాల ప్రాతిపదికన మారుతుంది.

కాగా కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఓల్డ్ వెహికల్స్ వంటి వాటికి సంబంధించిన రూల్స్ మార్పునకు మార్చి నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే లాక్ డౌన్ పరిస్థితుల్లో మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. మళ్లీ సలహాలు, సూచనలు కోరింది. కేంద్ర ప్రభుత్వం గతంలో మోటార్ వెహికల్ చట్టానికి సవరణలు చేసింది. రూల్స్‌ను కఠినతరం చేసింది. జరిమానా లను భారీగా పెంచింది. అంతేకాకుండా మోదీ సర్కార్ మరో కొత్త స్కీమ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మోటార్ క్యాబ్ రెంట్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగా కారు, టూవీరల్, సైకిల్ వంటి వాటిని అద్దెకు తీసుకోవచ్చు. ఇది సొంత వాహనం కొనుగోలు చేయలేనివారికి చలమేలు చేయనుంది.