Begin typing your search above and press return to search.
ఏపీలో వాహనాన్ని నడుపుతున్నారా? ఇది లేకుంటే జైలే
By: Tupaki Desk | 4 Jan 2020 4:50 AM GMTఏపీలో కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన కొత్త సూచనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరగుతున్నాయి. మరోవైపు.. వాహనాల్ని నడిపే వారిలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేని వారున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
2019లో ఏపీలో వాహనాల్ని నడిపిన వారిని తనిఖీలు చేయగా 88,872 మందికి డ్రైవింగ్ లైసెన్సులు లేవన్న చేదు నిజం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ఒక నివేదికను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ కమిటీకి అందజేసింది. వారి సూచనలు అనుసరించి.. ఏపీ వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాల్ని నడిపే వారిని నేరుగా జైలుకు పంపాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇంతకాలం డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఫైన్ వేయటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారిని పోలీసులకు అప్పజెబుతారు. అనంతరం వారిని నేరుగా జైలుకు పంపుతారు. రానున్న రోజుల్లో ఏపీలో జరిగే రోడ్డు ప్రమాదాల్ని 20 శాతం తగ్గించాలన్న లక్ష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో.. ఏపీలో వాహనం నడిపే వారంతా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు. లేకుంటే.. భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.