Begin typing your search above and press return to search.
అక్కడ డాక్టర్ బాబు రెడీ... ?
By: Tupaki Desk | 28 Oct 2021 4:30 PM GMTరాజకీయం, సినిమా రంగం ఈ రెండూ ప్రజలకు అతి దగ్గరగా ఉండే రంగాలు. ఈ రెండూ కూడా ప్రజాదరణతో ముడిపడినవే కావడం విశేషం. ఇక భారతీయ సంస్కృతిలో వారసత్వానికి ఎపుడూ పెద్ద పీట వేస్తారు. సినిమా హీరోల కొడుకులు హీరోలు అవుతున్నట్లే రాజకీయ నేతల కుమారులూ నాయకులు అవుతున్నారు. ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి అయిన ధర్మాన క్రిష్ణ దాస్ కుమారుడు మంచి జోరు మీద ఉన్నారు. ఈ మధ్యనే పోలాకీ జెడ్పీటీసీగా గెలిచి పొలిటికల్ అరంగేట్రం చేసిన డాక్టర్ క్రిష్ణ చైతన్య అదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. క్రిష్ణ దాస్ ని పక్కన పెట్టి మరీ ఆయన నరసన్నపేటలో విసృతంగా పర్యటిస్తున్నారు. ఆయన ప్రతీ రోజూ వందల సంఖ్యలో జనాలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ తెగ బిజీగా ఉన్నారు. ఒక విధంగా ఆరు పదులు దాటిన క్రిష్ణ దాస్ కి శ్రమ తగ్గిస్తున్నారు.
మరో వైపు చూస్తే ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచిన క్రిష్ణ దాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరాదు అని నిర్ణయించుకున్నారని టాక్. ఆయన పూర్వాశ్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవారు. వైఎస్సార్ పిలుపుతో 2004లో కాంగ్రెస్ లో చేరిన ఆయన అదే ఏడాది నరసన్న పేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో రెండవమారు గెలిచిన ఆయన వైఎస్సార్ మరణానంతరం జగన్ కి మద్దతు ఇచ్చారు. అలా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మరో మారు గెలిచారు. 2014లో ఓడినా 2019లో బంపర్ విక్టరీ కొట్టారు. దాంతో ఈ తడవ తన కుమారుడిని పోటీ చేయించాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.
నరసన్నపేట ధర్మాన కుటుంబానికి పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఫస్ట్ టైమ్ అంటే 1989లో ధర్మాన ప్రసాదరావు పోటీ చేసి గెలిచారు. 1994లో ఓడినా 1999లో ఆయన మళ్ళీ విజయం సాధించారు. ఇలా ఆ కుటుంబాన్ని గత మూడు దశాబ్దాలకు పైగా ఆదరించిన నరసన్నపేట నుంచి కుమారుడు డాక్టర్ క్రిష్ణ చైతన్యను పోటీ చేయించాలని చూస్తున్నారు. డాక్టర్ గా జనాలకు విశేష సేవ చేస్తున్న క్రిష్ణ చైతన్య రాజకీయల పట్ల మంచి ఆసక్తితో ఉన్నారు. రిజర్వేషన్ల వల్ల దక్కలేదు కానీ శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ కోసమే ఆయన గురి పెట్టారు. మొత్తానికి ఎమ్మెల్యే టికెట్ అడగడానికి రాజకీయ కుటుంబ నేపధ్యం, తన అనుభవం, జెడ్పీటీసీగా విజయం సాధించిన వైనం అన్నీ ఉపయోగిస్తారని డాక్టర్ బాబు తలపోస్తున్నారు. జగన్ కి క్రిష్ణ దాస్ అంటే చాలా ఇష్టం. ఆయనను మంత్రిగా చేయడమే కాదు, ఏకంగా డిప్యూటీ సీఎం చేశారు. ఇపుడు కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు ఆయన అడ్డు చెప్పరనే అంతా అంటున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో డాక్టర్ బాబు శకం స్టార్ట్ అయింది అంటున్నారు అంతా.