Begin typing your search above and press return to search.
'అవంతి' ఎక్కడుంటే అక్కడ వివాదాలేనా?
By: Tupaki Desk | 1 Oct 2019 7:32 AM GMTపడుతూ లేస్తూ పాలన సాగిస్తున్నా పార్టీలో విభేదాలు బయటపడకుండా నాలుగు నెలలుగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్న వైసీపికి తాజాగా విశాఖపట్నంలో నాయకుల మధ్య మాటల యుద్ధాలు తలనొప్పిగా మారాయి. పర్యటక మంత్రి అవంతి శ్రీనివాస్ - వీఎం ఆర్డీయే చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మధ్య ఓ సభలో జరిగిన మాటల యుద్ధం జగన్ వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో... అవంతి ఎక్కడుంటే అక్కడ వివాదాలేనని.. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు గంటాతో విభేదాలు తీవ్రంగా ఉండేవని - గంటా - అవంతిల మధ్య గొడవలు అప్పట్లో చంద్రబాబు వరకు వెళ్లాయని విశాఖ నేతలు గుర్తుచేస్తున్నారు.
విశాఖపట్నంలో గ్రామ - వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించిన సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ - వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సిటీలో పెరిగిన ద్రోణంరాజుకు గ్రామాల్లోని పరిస్థితులు పెద్దగా తెలియవని అవంతి వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. అవంతి మాటలకు స్పందించిన ద్రోణంరాజు.. మంత్రి అవంతి చిన్నా పెద్దా తేడా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామ కరణం - సర్పంచ్ గా పనిచేశారని - ఆపై ఎమ్మెల్యే - ఎంపీగా పనిచేశారని వివరించారు. తాము వచ్చిందే గ్రామస్థాయి నుంచి అని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం అవంతికి సరికాదని - మంత్రి సభామర్యాదలు పాటించాలని హితవు పలికారు.
మరోవైపు మంత్రి అవంతితో విశాఖలోని మరికొందరు నాయకులతోనూ సయోధ్య లేదని తెలుస్తోంది. అవంతి మంత్రి పదవి దక్కినతరువాత సీనియర్ నాయకులను సైతం గౌరవించడం లేదన్న ఆరోపణలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ద్రోణంరాజుతోనూ వివాదమేర్పడిందని చెబుతున్నారు. ఆయన టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా పార్టీలో లొల్లి తప్పదని వైసీపీ నేతలు అంటున్నారు.