Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ లో మ‌ళ్లీ డ్రోన్ అల‌జ‌డి.. ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   2 July 2021 9:30 AM GMT
క‌శ్మీర్ లో మ‌ళ్లీ డ్రోన్ అల‌జ‌డి.. ఏం జ‌రుగుతోంది?
X
జ‌మ్మూక‌శ్మీర్ లో డ్రోన్లు అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. గ‌డిచిన ఆరు రోజుల్లో ఏడు సార్లు క‌నిపించిన డ్రోన్లు.. తాజాగా మ‌రోసారి స‌రిహ‌ద్దులో ఎగిరాయి. గ‌త ఆదివారం ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ మీద‌ డ్రోన్ దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఆర్మీ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఈ నెల 27వ తేదీన ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ పై డ్రోన్ దాడి జ‌రిగిన‌ త‌ర్వాత జ‌మ్మూ - ప‌ఠాన్ కోట్ నేష‌న‌ల్ హైవే స‌మీపంలోని సైనిక కేంద్రం వ‌ద్ద అర్ధ‌రాత్రివేళ రెండు డ్రోన్లు ఎగిరిన‌ట్టు భార‌త ఆర్మీ అధికారులు తెలిపారు. చీక‌ట్లో డ్రోన్ల‌పై కాల్పులు జ‌రిపినా.. టార్గెట్ మిస్సైంద‌ని ఆర్మీ సిబ్బంది వెల్ల‌డించారు. దీంతో.. జ‌మ్మూలోని ఆర్మీ అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత 28వ తేదీ సోమ‌వారం కూడా జ‌మ్మూలో మ‌రో రెండు డ్రోన్లు ఎగిరిన‌ట్టు అధికారులు తెలిపారు.

ఆ త‌ర్వాత‌ బుధ‌వారం కూడా జ‌మ్ములోని మూడు వేర్వేరు చోట్ల డ్రోన్లు ఎగిరిన‌ట్టు సైనిక వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. మిరాన్ సాహిబ్‌, కాలుచ‌క్‌, కుంజావ‌నీ ప్రాంతాల్లో ఈ డ్రోన్లు క‌నిపించిన‌ట్టు భార‌త ఆర్మీ అధికారులు గుర్తించారు. దీంతో.. గ‌స్తీ ముమ్మ‌రం చేశారు. కాగా.. వైమానిక స్థావ‌రంపై డ్రోన్ దాడి జ‌ర‌గ‌డం, వ‌రుస‌గా డ్రోన్లు ఎగురుతుండ‌డం ప‌ట్ల కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. ఈ డ్రోన్ కేసును ఛేదించే బాధ్య‌త‌ను ఎన్ఐఏకు అప్ప‌గించింది.

ఈ క్ర‌మంలోనే జ‌మ్మూలో అధికారులు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. నాలుగు రోజుల్లోనే ఏడు డ్రోన్లు క‌నిపించ‌డంతో.. ఇది పాక్ ఉగ్ర‌వాదుల ప‌నిగానే సందేహిస్తున్నారు. సైనిక స్థావ‌రాల‌ను గుర్తించి, దాడిచేసే వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారా? అని అనుమానిస్తున్నారు. దీంతో.. ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భౄగంగా.. జ‌మ్మూలో డ్రోన్లు ఎగ‌ర‌డాన్ని నిషేధించారు. డ్రోన్లు మాత్ర‌మే కాకుండా.. ఇత‌ర ఎగిరే వ‌స్తువులన్నింటినీ నిషేధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. నిబంధ‌న‌ల‌ను కాద‌ని హెచ్చ‌రిస్తే మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

అయిన‌ప్ప‌టికీ.. శుక్ర‌వారం ఉద‌యం (జూలై 2) మ‌రోసారి డ్రోన్ పాక్ వైపు నుంచి ఇండియాలోకి ప్ర‌వేశించేందుకు విఫ‌ల‌య‌త్నం చేసింద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. అర్నియా స‌రిహ‌ద్దులోంచి క‌శ్మీర్ లోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని తెలిపారు. ఈ విష‌యం గుర్తించి వెంట‌నే కాల్పులు జ‌ర‌ప‌గా.. త‌ప్పించుకొని వెళ్లిపోయింద‌ని వెల్ల‌డించారు. రెక్కీ నిర్వ‌హించ‌డంలో భాగంగానే ఈ చ‌ర్య‌ల‌కు ఉగ్ర‌వాదులు పాల్ప‌డుతున్నార‌ని అధికారులు అనుమానిస్తున్నారు. సైనిక స్థావ‌రాల‌ను గుర్తించి దాచేసే కుట్ర‌లు ప‌న్నుతారా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.