Begin typing your search above and press return to search.
పాక్ ను చీల్చి చెండాడిన అసదుద్దీన్!
By: Tupaki Desk | 26 Feb 2019 10:33 AM GMTపుల్వామా ఉగ్రదాడి.. దానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందించిన తీరు.. తాజాగా భారత్ జరిపిన మెరుపుదాడులపై తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాక్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వం నటిస్తున్నారంటూ మండిపడిన ఆయన.. కెమెరా ముందు కూర్చొని భారత్ కు సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఇమ్రాన్ పై ఫైర్ అయ్యారు.
పుల్వామా ఉగ్రదాడి భారత్ పై జరిగిన మొదటి దాడి ఏమీ కాదన్నారు. పఠాన్ కోఠ్.. ఉరి.. తాజాగా పుల్వామా దాడి అని.. పాక్ ప్రధాని అమాయకత్వం ముసుగు వీడాలన్నారు. 1947లో జిన్నా ప్రతిపాదిన దేశ విభజనను వ్యతిరేకించి ఇష్టపూర్వకంగానే ఇండియన్ ముస్లింలు భారత్ లోనే ఉండిపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు.
భారత్ లో దేశ పౌరులంతా కలిసిమెలిసి ఉండటాన్ని చూసి పాక్ కుళ్లుకుంటుందన్నారు. పాక్ మంత్రి ఒకరు ఇటీవల మాట్లాడుతూ.. ఇండియాలోని ఆలయాల్లో గంటలు మోగకుండా చేస్తామని చెప్పారని..ఆయనకు తానో విషయాన్నిచెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు.ఇండియా గురించిఆ మంత్రికి తెలీదని.. ఈ దేశానికి చెందిన ముస్లింలు బతికి ఉన్నంతకాలం మసీదుల్లో అజాన్ వినిపిస్తుందని.. అదే విధంగా గుడి గంటలు మోగుతూనే ఉంటాయన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారత్ సౌందర్యమని.. దాన్ని చూసి పాక్ కుళ్లుకుంటుందన్నారు. పుల్వామా దాడితో పాక్ కు లింకులు ఉన్నాయన్న అసద్.. పాక్ సర్కార్.. పాక్ ఆర్మీ.. ఐఎస్ ఐ పథకం ప్రకారమే ఉగ్రదాడి జరిగిందన్నారు.
40 మంది దేశ జవాన్లను పొట్టన పెట్టుకోవటానికి తామే బాధ్యత తీసుకున్నట్లు జైషే మహ్మద్ ప్రకటించిందన్న అసద్.. తీవ్ర స్వరంతో నువ్వు జైషే మహ్మద్ కాదు.. జైషే సైతాన్ వి అన్నారు. మసుద్ నువ్వు మౌలానావి కాదు.. సైతాన్ వి.. అది లస్కరే తొయిబా కాదు.. లష్కరే సైతాన్ అంటూ మండిపడ్డారు.