Begin typing your search above and press return to search.
డ్రగ్ష్ కేసు.. తెలంగాణ ఎమ్మెల్యేలకు ఉచ్చు తప్పదట
By: Tupaki Desk | 13 April 2021 7:30 AM GMTకర్ణాటకలో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో అనూహ్యంగా తెలంగాణకు చెందిన వ్యాపారులు.. ప్రజాప్రతినిధులు ఉండటం తెలిసిందే. కన్నడ నిర్మాత శంకరగౌడ తరచూ నిర్వహించే పార్టీలకు హాజరయ్యే వారికి సంబంధించిన వివరాల సేకరణపై కర్ణాటక పోలీసులు ఫోకస్ చేశారు. అతగాడు బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్టీలకు ప్రతి సారి తెలంగాణ నుంచి అనేక మంది హాజరైనట్లుగా అక్కడి పోలీసులు చెబుతున్నారు.
డ్రగ్స్ వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు పలువురు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని పేర్లు సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయినా.. అధికారికంగా మాత్రం అక్కడి పోలీసులు ఎవరి పేర్లు చెప్పలేదు. ఇదిలా ఉంటే.. తొలుత అనుకున్నట్లుగా ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని భావించినా.. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరుగుతుందన్నమాట వినిపిస్తోంది.
పోలీసుల అదుపులో హైదరాబాద్ వ్యాపారి కల్ హర్ రెడ్డి ఉండటం.. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు సిద్ధంగా ఉండటంతో.. తెలంగాణ రాజకీయ నేతల పేర్లు బయటకు వెలువడే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అలజడి చెలరేగటం ఖాయమంటున్నారు.
ఇప్పటివరకు వినిపిస్తున్న మాటల ప్రకారం చూస్తే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో అధికారాపార్టీకి చెందిన వారే ఉంటారని చెబుతున్నారు. అయితే.. అలాంటి పేర్లు ఏమైనా బయటకు వస్తే.. వెంటనే వారిపై శాశ్వత నిషేధం విధించటానికి తెలంగాణ అధికారపక్షం సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.