Begin typing your search above and press return to search.

నా కొడుకు డ్ర‌గ్స్ బానిసః కెల్విన్ తండ్రి

By:  Tupaki Desk   |   15 July 2017 11:07 AM GMT
నా కొడుకు డ్ర‌గ్స్ బానిసః కెల్విన్ తండ్రి
X
హైద‌రాబాద్ డ్ర‌గ్స్ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రాకెట్ లో కీల‌క సూత్ర‌ధారిగా భావిస్తున్న కెల్విన్ ను పోలీసులు విచారిస్తున్నారు. అత‌డికి చాలామంది సినీ ప్ర‌ముఖులు - బ‌డా పారిశ్రామికవేత్త‌ల‌తో సంబంధాలున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, త‌న కొడుకు కెల్విన్ అమాయ‌కుడ‌ని అత‌డి తండ్రి జ‌వ‌హ‌ర్ మీడియాతో అన్నారు. కెల్విన్‌ డ్రగ్స్‌కు బానిసైన విషయం వాస్తవమేనని తెలిపారు.

ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో అస‌లు సూత్ర‌ధారులు వేరే ఉన్నార‌న్నారు. కెల్విన్ కు డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేసి విచార‌న జ‌రిపితే అసలు నిందితులు బయటకు వస్తార‌న్నారు. కెల్విన్‌ ను సిట్‌ అధికారులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు కెల్విన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. కెల్విన్‌ కాల్‌ లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇప్పటివరకు 13మందిని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్సుమెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఏ-1గా కెల్విన్ ఉన్నారు. మిగతావారు వరుసగా అబ్దుల్ కుదుస్ - అబ్దుల్ వాయిద్ - ఆమెన్ నాయుడు - నిఖిల్ శెట్టి - కుందన్ సింగ్ - అనిరుధ్‌ - సంతోష్ దీప్ - మహ్మద్ జీ అలీఖాన్ - బెర్లాండ్ విల్సన్ - అనిష్ - రీతుల్ అగర్వాల్ - పీయూష్‌ లు ఉన్నారు.

కాగా, వీరిలో మొదటిసారి అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారించేందుకు ఎక్సైజ్ ఎన్‌ ఫోర్సుమెంట్ అధికారులు చర్లపల్లి జైలు నుంచి రెండు రోజుల తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు విచార‌ణ‌లో మ‌రింత మంది సినీ ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని వినికిడి.