Begin typing your search above and press return to search.
రెండు దేశాల మధ్య సొరంగమే తవ్వేశారు
By: Tupaki Desk | 18 May 2022 5:28 AM GMTమాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, వినియోగం హోలు మొత్తం మీద వ్యాపారం యావత్ ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా తయారవుతోంది. కొలంబియా, మెక్సికో లాంటి దేశాల నుండి మిగిలిన ప్రపంచదేశాలకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను ఎగుమతి చేస్తున్నారు.
మాదక ద్రవ్యాల ఎగుమతిని కంట్రోల్ చేయటానికి చాలా దేశాలు అనేక విధానాలు పాటిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు అప్ డేట్ అవుతు, నిఘా వ్యవస్ధలను పటిష్టం చేసుకుంటున్నారు. ఇన్ఫార్మర్ వ్యవస్ధలను కూడా బలోపేతం చేసుకుంటున్నారు.
ఒకవైపు వ్యాపారాన్ని విస్తరించాలని వ్యాపారులు, మరోవైపు నియంత్రించాలని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మెక్సికో వ్యాపారులు అతిపెద్ద ప్లాన్ వేశారు. అదేమిటంటే మెక్సికో నుంచి అమెరికాలోకి పెద్ద సొరంగాన్ని తవ్వేశారు.
తవ్విన సొరంగం కూడా మామూలుగా లేదు. సొరంగం ద్వారా మాదకద్రవ్యాల రవాణా యధేచ్చగా సాగిపోయేందుకు ఏకంగా రైలు పట్టాలు, ఆక్సిజన్ అందే ఏర్పాట్లు, విద్యుత్ వ్యవస్థ, పటిష్టమైన గోడలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
అమెరికా-మెక్సికో దేశాల మధ్య రాకపోకలు, అనధికారిక వలసలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఈ అక్రమ వలసలను కంట్రోల్ చేయటానికి రెండు దేశాల మధ్య సుమారు 2500 కిలోమీటర్ల పొడవైన గోడ కడుతున్నది అమెరికా. రెండు దేశాల సరిహద్దులో అమెరికా పెద్ద ఎత్తున సైనిక పహారాను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మాదకద్రవ్యాల రవాణాను కంట్రోల్ చేయటానికి ఇంత పెద్ద ఎత్తున సైనికుల మోహరింపు జరుగుతోంది. అయినా ఏదో రూపంలో వలసలు జరుగుతునే ఉన్నాయి.
కొద్ది మొత్తంలో మాదకద్రవ్యాల రవాణా వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకున్నారో ఏమో వ్యాపారులు. అందుకనే మెక్సికోలోని టిజువానా నుండి అమెరికాలోని శాన్ డియాగో ప్రాంతంలోని ఒక గోడౌన్ వరకు అతిపెద్ద సొరంగాన్ని తవ్వేశారు. భూగర్భంలో ఆరు అంతస్తులంత లోతు, 4 అడుగుల వెడల్సున 532 మీటర్ల పొడవున ఈ సొరంగాన్ని తవ్వటం ఆశ్చర్యంగా ఉంది.
అమిస్టడ్ పార్క్ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఒక గోడౌన్ దగ్గర ఒక గుంత కనబడింది. అందులోకి తొంగి చూసినపుడు పెద్ద నిచ్చెన కనబడింది. నిచ్చెన ద్వారా దిగినపుడు ఈ సొరంగం బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.