Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..తాగి ఎంత ఎంతమంది దొరికారంటే?

By:  Tupaki Desk   |   2 Jan 2020 5:31 AM GMT
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..తాగి ఎంత ఎంతమంది దొరికారంటే?
X
కొత్త సంవత్సరం వేడుకలని దేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్నారు. చిన్న - పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వేడుకల్లో చాలా ఉత్సహంగా పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మందుబాబులైతే రెచ్చిపోయారు. డిసెంబర్ 31 న రాత్రి ఒక్కరోజే సుమారుగా 500 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుంది అని అంచనా..ఇకపోతే , ఒకవైపు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి అనుమతిచ్చి.. ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చెయ్యనిచ్చి.. మరోవైపు వేడుకల నుంచి వచ్చేవాళ్ల నోళ్లలో బ్రీత్ అనలైజర్లు పెట్టిమరీ బుక్ చేశారు పోలీసులు.

డిసెంబర్ 31 రాత్రి తర్వాత ఏకంగా వేలాదిమందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మందుతాగి పట్టుపడినవాళ్లలో మహిళలు కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోని అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోన్న వేళా.. చట్టం తన పని తాను చేసుకుపోయింది. డిసెంబర్‌ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్న పోలీసులు.. మొత్తం 3148 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 951 కేసులు - సైబరాబాద్‌ పరిధిలో 873 - రాచకొండ రేంజ్ లో 281 కేసులు నమోదైనట్టు తెలిపారు.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రోడ్లమీద - పబ్బుల్లో - క్లబ్బుల్లో డ్యాన్సులు చేసి తిరిగొస్తున్నవాళ్లు ఎక్కువగా పట్టుపడింది బెంగళూరులోనే. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచే తనిఖీలు మొదలు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. నవంబర్ ఎండ్ నాటికే సిలికాన్ సిటీలో మొత్తం 37,654 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సిటీ పోలీసులు తెలిపారు. ఇక ముంబైలో మంగళవారం రాత్రి తాగి వాహనాలు నడుపుతోన్న సుమారు వెయ్యిమందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

ఇక కోల్ కతాలో మాత్రం 188 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ - యూపీ - హర్యాణా - పంజాబ్ - బీహార్ తదితర రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతుండటంతో అక్కడి జనం న్యూఇయర్ వేడుకల్ని పెద్దగా సెలెబ్రేట్ చేసుకోలేకపోయారు. రోడ్లను పొగమంచు కప్పేయడంతో డిసెంబర్ 31 రాత్రి రాకపోకలు ఎక్కువగా చోటుచేసుకోలేదు.అలాగే అక్కడి పోలీసుల వార్నింగ్ కూడా బాగానే పనిచేసింది.