Begin typing your search above and press return to search.
సిటీలో ఆ కేసుల్లో ఇప్పటికి 5వేల మంది జైలుకు
By: Tupaki Desk | 16 Aug 2016 10:09 AM GMTఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. మరెన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నా ఫూటుగా తాగి వాహనాన్ని నడిపే బ్యాచ్ కు మాత్రం కనువిప్ప కలగని పరిస్థితి. చిన్న పెద్దా.. అన్న తేడా లేకుండా ఫూటుగా తాగేయటం.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేయటం.. ఎదుటోళ్ల ప్రాణాలతో పాటు.. వారి ప్రాణాలు తీసుకునే ఘటనలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయే తగ్గటం లేదు. హైదరాబాద్ మహానగరంలో ప్రముఖుల కుటుంబాల మొదలు.. మామూలు మధ్యతరగతి జీవుల ఇళ్ల వరకూ పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. పెను ప్రమాదాల్ని కొని తెచ్చుకోవటం ఒక అలవాటుగా మారింది. దీని కారణంగా విలువైన ప్రాణాలు పోగొట్టుకోవటమే కాదు.. తమను నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఆందోళనకర పరిణామం ఏమిటంటే.. హైదరాబాద్ మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సైతం దొరికిపోవటం.
ప్రమాదాల మీద ఎంత అవగాహన పెంచినా.. డ్రంక్ చేసిన డ్రైవ్ చేసే వారికి జైలుశిక్ష విధించినా ఏ మాత్రం మార్పు రాకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా గణాంకాలు చూస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కాక మానదు. ఎందుకంటే గడిచిన ఏడు నెలల్లో హైదరాబాద్ మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బుక్ అయిన 5 వేల మంది జైలుకు వెళ్లి వచ్చిన పరిస్థితి.
దీనికి వాళ్లూ.. వీళ్లు అన్న తేడా లేదు. ఇంట్లో వాళ్లు కట్టడి చేసినా.. వారికి తెలియకుండా చెక్కేసి.. ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి. దీనికి తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని పోలీస్ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఒక బడా వ్యాపార వేత్త ఇంట్లోని సభ్యులంతా కలిసి భోజనం చేశారు. ఇంట్లో వారికి గుడ్ నైట్ చెప్పేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి వచ్చిన ఒక ఫోన్ కాల్ తో సదరు పారిశ్రామివేత్త నిద్ర ఎగిరిపోయింది. ఎందుకంటే.. తన కుమారుడికి యాక్సిడెంట్ అయ్యిందంటూ పోలీసులు ఫోన్ చేశారు. తనతోపాటు భోజనం చేసిన తన కుమారుడు రూంలో నిద్రపోతున్నాడని చెప్పినా.. వదలని పోలీసులు ఒక్కసారి చెక్ చేసుకోవాలని చెప్పటంతో.. కొడుకు బెడ్రూంలోకి వెళ్లి చూస్తే లేని పరిస్థితి.
తర్వాత విచారణలో తేలిన విషయం ఏమిదంటే.. తండ్రికి గుడ్ నైట్ చెప్పిన తర్వాత రహస్యంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి.. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని పూటుగా తాగేసి బండిని నడిపించటంతో ప్రమాదానికి గురైన విషయం కాస్త ఆలస్యంగా ఆయనకు బోధ పడింది. దీంతో.. నోట మాట రాలేదు. ఇలాంటి ఉదంతాలు ఈ మధ్యన సిటీలో మరీ ఎక్కువ అవుతున్నాయి. తాగి వాహనాలు నడిపితే జైలుశిక్ష విధిస్తున్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలు తగ్గకపోవటం గమనార్హం.
తాగి డ్రైవ్ చేసినా.. దొరకమన్న ధీమాతో కొందరు.. ఏం ఫర్లేదు లైట్ తీసుకో అంటూ మరికొందరు.. ఇలా ఎవరికి వారు తాగి బండి నడిపేయటం.. తర్వాత దొరికిపోతున్నారు. గడిచిన పదిహేను రోజుల్లో 600 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 12వ తేదీ ఒక్క రోజునే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 526 మందికి కోర్టు 14.72 లక్షల జరిమానాతో పాటు గరిష్ఠంగా మూడు నెలలు జైలుశిక్ష విధించారు. గడిచిన సంవత్సరం మొత్తంలో 2490 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తే..ఈ ఏడాది ఇప్పటికి (ఎనిమిది నెలల వ్యవధిలో) 5349 కేసులు నమోదు కావటం గమనార్హం. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. గడిచిన ఏడు నెలల్లో హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో యువతులూ పట్టుబడటం. ఏడు నెలల వ్యవధిలో దాదాపు 40 మంది వరకూ అమ్మాయిలు తాగి బండి నడుపుతూ పోలీసులు దొరికిపోవటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో అబ్బాయిలు మాత్రమే దొరికితే.. ఇప్పుడు అమ్మాయిలు కూడా దొరికిపోవటం చూస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం అసన్నమైందని చెప్పొచ్చు.