Begin typing your search above and press return to search.

డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసులివీ

By:  Tupaki Desk   |   2 Jan 2022 9:31 AM GMT
డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసులివీ
X
మహానగరం హైదరాబాద్ లో డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. మందు, విందులు, చిందేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే బయటకు తాగి వచ్చిన వారిని పోలీసులు వదిలిపెట్టలేదు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో బుక్ చేశారు.

డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మందుబాబులు మాత్రం మారలేదు. కేసులు వేలల్లోనే బుక్ అయ్యాయి..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మద్యం బాబులను తనిఖీ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3,146 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ కమిషనరేట్‌లో 1,258, సైబరాబాద్ కమిషనరేట్‌లో 1,528, రాచకొండ కమిషనరేట్‌లో 360 కేసులు నమోదయ్యాయి.

ఈ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 265 బృందాలతో తనిఖీలు నిర్వహించారు. 31వ తేదీ రాత్రి పోలీసులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని, నగరంలోని ప్రతి వీధి చివర తనిఖీలు ఉంటాయని, అయినప్పటికీ ఉల్లంఘనలు జరుగుతాయని.. కేసులు బుక్ చేయబడతాయని అందరికీ తెలుసు.

అదృష్టవశాత్తూ తాగి చేసిన పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే వైన్ షాపులు, బార్లు మరియు పబ్బులు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంటల వరకు పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో మందుబాబులు పండుగ చేసుకున్నారు.