Begin typing your search above and press return to search.
తాగినోళ్లకు సిగ్నల్ పడితే మాత్రం లెక్కేంటి.. ఆగిన బైకుపైకి దూసుకెళ్లిన బెంజ్
By: Tupaki Desk | 13 Nov 2020 4:32 PM GMTహైదరాబాద్ సైబర్టవర్స్ సిగ్నల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి సిగ్నల్ పడ్డ విషయం కూడా మరిచిపోయి తన కారును దంపతులు ప్రయాణిస్తున్న టూవీలర్మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇందుకు సంబంధించిన వివరాలు.. ఒడిశాకు చెందిన గౌతమ్‌దేవ్ తన భార్య శ్వేతతో టూవీలర్‌పై ఆఫీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని సైబర్ టవర్ వద్ద సిగ్నల్ పడటంతో టూవీలర్‌ను ఆపాడు.
కాశీ విశ్వనాథ్, కౌశిక్ అనే ఇద్దరు యువకులు రాత్రంతా పబ్బులో తాగి తెల్లవారు జామున ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో సైబర్ టవర్స్ వద్ద సిగ్నల్ పడిఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా తమ బెంజ్‌కారును ముందుకుపోనిచ్చారు. ద్విచక్ర వాహనం ఢీకొని వెళ్లారు.దీంతో వాహనం మీద ఉన్న గౌతమ్‌దేవ్, అతడి భార్య శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా గౌతమ్‌దేవ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. శ్వేత తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం కోమాలోకి వెళ్లింది. నిర్లక్ష్యంగా కారును నడిపిన కాశీ విశ్వనాథ్ అతడి స్నేహితుడు కౌశిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాక్డౌన్ సడలింపులతో బార్లు, పబ్బులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉంటున్నాయి. మరికొన్ని పబ్బలు ఉదయం నాలుగు గంటలవరకు ఓపెన్ ఉంటున్నాయి. దీంతో కొందరు బడాబాబులు ఫుల్‌గా మద్యం సేవించి రోడ్లమీదకు వస్తున్నారు. తాగిన మత్తులో ఎంత స్పీడ్ గా వెళ్తున్నది వాళ్లు లెక్క చేయడం లేదు. తెల్లవారుజామున డ్రంకెన్ డ్రైవ్ ఉండదన్న కారణంతో మితిమీరిన వేగంతో వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. మద్యం బాబుల రాంగ్ డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన మార్గాల్లోనే ఈ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.