Begin typing your search above and press return to search.
డ్రంకన్ డ్రైవ్ కు శిక్ష; రోడ్ల మీద తిప్పారు
By: Tupaki Desk | 19 Oct 2015 6:15 PM GMTఅనుకోకుండా జరిగే ప్రమాదాల్ని ఆపలేం. కానీ.. ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని పక్కాగా తెలిసినా.. నిర్లక్ష్యంతో.. ఏమవుతుందన్న మొండితనంతో వ్యవహరించే మందుబాబుల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఫుల్ గా మందుకొట్టేసి.. రోడ్ల మీద రయ్యిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చోటు చేసుకోవటానికి కారణమయ్యే వారు చాలామందే ఉంటారు.
ఇలాంటి వారికి బ్రేకులు వేసేందుకు గత కొద్దికాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరానికి పాల్పడే వారిని గుర్తించి పట్టుకోవటం.. ప్రత్యేక తనిఖీలు నిర్వహించటం తెలిసిందే. తాజాగా శుక్ర.. శనివారం రెండు రోజుల్లో మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 22 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద అదుపులోకి తీసుకున్నారు.
మితిమీరి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం మియాపూర్ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా వీరికి న్యాయమూర్తి వినూత్నమైన శిక్షను విధించారు.
‘‘డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్’’ అన్న ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ ప్రచారం చేయాలన్న శిక్షను విదించారు. దీన్ని అమలు చేసేందుకు పోలీసులు ఈ 22 మంది చేత ప్లకార్డులు పట్టించి.. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి ట్రిఫుల్ ఐటీ కూడలి మీదుగా నానక్ రాం గూడ ఐటీ జోన్ లోని విప్రో సర్కిల్ వరకూ నడిపించారు.
చేసిన తప్పుల కంటే.. ఎదురయ్యే అవమానం భారీగా ఉంటుందన్న విషయాన్ని వీరిని చూసిన తర్వాత అయినా మందుబాబులు గుర్తుంచుకుంటే బాగుంటుంది. నిజంగా తాగి ఎంజాయ్ చేయాలంటే ఇంటికే మందు తీసుకెళ్లి పూటుగా తాగేసి పడిపోతే నష్టమేంటి? అంతేకాదు.. రోడ్డు మీదకు వచ్చి సంబంధం లేని వారి ప్రాణాల మీదకు తెచ్చే కన్నా.. ఇంట్లో తాగటం బెటరేమో. ఇదంతా లేకుండా తాగుడు మానేస్తే మరింత మంచిది.