Begin typing your search above and press return to search.
తాగి చిందులేసి సారీ అంటే ఎలా డాక్టరమ్మ?
By: Tupaki Desk | 30 Jan 2016 12:33 PM GMTకొన్ని వృత్తులకు.. ఉద్యోగాలకు ఉండే గౌరవం అంతా ఇంతా కాదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా కనిపించే దేవుడిగా డాక్టర్లను కొలుస్తుంటారు. అలాంటి డాక్టర్లు హద్దులు మీరి రోడ్ల మీద పడి రచ్చ చేయటం ఉంటుందా? అలాంటి యవ్వారమే ఈ మధ్యన అమెరికాలోని మియామీ నగరంలో చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన మహిళా డాక్టర్ అంజలికి ఏమైందో కానీ.. ఉబెర్ క్యాబ్ లో ప్రయాణించిన సందర్భంగా చేసిన రచ్చ సోషల్ మీడియాలో చాలానే హడావుడి చేసింది.
ఫూటుగా తాగేసిన డాక్టరమ్మ ఉబర్ క్యాబ్ డ్రైవర్ మీద చేయి చేసుకోవటమే కాదు.. కారులోని పేపర్లు.. ఇతర వస్తువుల్ని బయటకు విసిరి కొట్టింది. 30 ఏళ్ల ఈ డాక్టరమ్మ ఉబర్ డ్రైవర్ ను కొట్టిన దృశ్యాలతో పాటు.. రోడ్డు మీద రచ్చ వీడియో రూపంలోకి రావటంతో ఆమె పని చేస్తున్న ఆసుపత్రి ఆమెను విధుల నుంచి తప్పించింది. మత్తు దిగిన తర్వాత తనకు సంబంధించిన వీడియో చూసి తన కళ్లను తానే నమ్మలేకపోతుందట.
న్యూరాలజీ రెసిడెంట్ గా పని చేస్తున్న అంజలి తాజాగా క్షమాపణలు చెప్పారు. తన కళ్లను తానే నమ్మలేకపోతున్నానని.. ఆ వీడియోలో ఉన్నది తానే అని నమ్మలేకపోతున్నామంటూ వాపోయింది. తాను చేసిన పనికి తన కుటుంబం పరువు మొత్తం పోయిందని వాపోతున్న డాక్టరమ్మ.. అదంతా పూటుగా తాగక ముందు ఉండాలన్న విషయాన్ని మిస్ అవుతున్నారే..?