Begin typing your search above and press return to search.
పోలీసును మరింత కష్టాల్లోకి నెట్టిన సోషల్ మీడియా
By: Tupaki Desk | 21 March 2016 9:01 AM GMTసోషల్ మీడియా అంటే ప్రజల శక్తిగా ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అదేసమయంలో సోషల్ మీడియా అపోహల రాజ్యంగా కూడా మారుతోంది. ఇలాంటి తరుణంలో మంచి - చెడుల మధ్య సమన్వయం సాధించగలిగితే సోషల్ మీడియా నిజంగానే తిరుగులేని సామాజిక శక్తిగా, ఎవరూ మద్దతూ లేనివారి వెనుక సైన్యంగా మారుతుంది. గతంలో ఓ వృద్ధుడిపై పోలీసుల దాష్టీకం... ఆయన టైప్ మిషన్ ను పగలగొట్టి ఫుట్ పాత్ నుంచి వెళ్లగొట్టడం వంటి సంఘటనలను సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆ వృద్ధుడికి న్యాయం జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదేసమయంలో తప్పుడు ప్రచారాల కారణంగా జరుగుతున్న నష్టమూ తక్కువేం కాదు. తాజాగా జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణ.
ఢిల్లీలో సలీం పీకే అనే 50 ఏళ్ళ హెడ్ కానిస్టేబుల్ కథ ఇది. ఢిల్లీ మెట్రోలో ఆయన తూలుతూ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. యూట్యూబ్ లో ఈ వీడియోకు రోజుకు రెండు లక్షల హిట్లు వచ్చిపడ్డాయి. ‘డ్రంక్ ఢిల్లీ పోలీస్ మ్యాన్ ఆన్ ఢిల్లీ మెట్రో-ఫన్నీ’ అనే టైటిల్ తో ఇండియాలోనే కాక, విదేశాల్లో కూడా ఇది పాపులర్ అయింది. పైగా మెట్రో రైళ్ళలో ప్రయాణికుల భద్రత మీద టీవీ డిబేట్లలో చర్చల మీద చర్చలు జరిగాయి. ఈ వీడియో నిజమేననుకుని సలీంను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అది తెలిసేసరికి పోలీసు శాఖ తమ తప్పు తెలుసుకుంది... సోషల్ మీడియా కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బెటర్.
నిజానికి సలీం బ్రెయిన్ హేమరేజ్ తో బాధ పడుతున్నాడని.. దీనివల్ల అతని శరీరంలో ఎడమ భాగం పాక్షికంగా పక్షవాతానికి గురైంది. ఫలితంగా అతడు పట్టు కోల్పోయి తరచూ ఇలా పడిపోతుంటాడు. అయితే సోషల్ మీడియా ఇదంతా తెలియక ఆయన్ను తాగుబోతుగా చిత్రీకరించడంతో పోలీస్ శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సలీం సుప్రీంకోర్టుకు కూడా ఎక్కాడు. తన సస్పెన్షన్ ఎత్తివేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించాడు. సోషల్ మీడియా కారణంగా తన ప్రతిష్టకు భంగం కలిగిందని పేర్కొన్నాడు. అతని మెడికల్ రిపోర్టులు వగైరా పరీక్షించిన కోర్టు అతడ్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో అధికారులు అతడి సస్పెన్షన్ రద్దు చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకుని సారీ చెప్పారు.