Begin typing your search above and press return to search.
చుక్కేసి స్టీరింగ్ పట్టుకుంటే పగలే చుక్కలు..?
By: Tupaki Desk | 24 Jun 2015 9:11 AM GMTఒకరి ఆనందం మరొకరి పాలిట శాపంగా మారకూడదు. ఒకరి మత్తులో ఊగిపోవటం మరొకరికి మరణశిక్షగా మారకూడదు. పెరిగిపోతున్న రోడ్డు యాక్సిడెంట్లలో చాలా వరకు వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం.. అజాగ్రత్త వల్లనే అన్న విషయం మర్చిపోకూడదు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటంతో పాటు.. ఫుల్‌గా తాగేసి రోడ్డు మీదకు వాహనాన్ని తీసుకొచ్చేసి.. రోడ్డు యాక్సిడెంట్లు చేసే వారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది.
ఇప్పటివకే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వేస్తున్న జరిమానాలు కాకుండా.. మందు తాగాక స్టీరింగ్ టచ్ చేయాలంటేనే బెదిరిపోయేలా చట్టాన్ని కఠినతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా తాజా చట్టంలో చేర్చాలనుకున్న ప్రతిపాదనలు చూస్తే.. తాగాలన్న ఆలోచన మర్చిపోయేలా ఉందన్న వాదన వినిపిస్తోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే ఐదురెట్లు జరిమానా విధించటం.. అదే రెండోసారీ అదే తప్పు చేసి పట్టుబడితే రూ.10వేల జరిమానా.. ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించాలని.. ఏడాది పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.
ఇక బీమా చేయించని వాహనాలకు రూ.లక్ష వరకు జరిమానా.. మోడల్‌లో లోపాలు ఉంటే రూ.5లక్షల వరకు ఫైన్ విధించాలన్నఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రిత్వ శాఖ దగ్గర ప్రతిపాదనలుగా ఉన్న వీటిని.. వెంటనే చట్టాలుగా మార్చేసి.. కఠినంగా అమలు చేస్తే.. అమాయక ప్రాణాలు ఎన్నో కాపాడే ఛాన్స్ ఉందన్న మాట వినిపిస్తోంది.