Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో మరోఘోరం..మోడల్ పై అత్యాచారం!
By: Tupaki Desk | 11 Jan 2020 5:44 AM GMTదేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ దిశ ఘటన జరిగిన రోజు నుండి మహిళలపై ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ మిస్ మోడల్ కు ప్రయత్నిస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు అతి దారుణంగా అత్యాచారం చేశారు. ఓ వ్యక్తి అత్యాచారం చేస్తుండగా, మరో యువకుడు సెల్ ఫోన్ లో వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడి చేశారు. అలాగే ఆమెకు మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
గత నెల 28వ తేదీన ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత ఆ యువతి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం జనవరి 7న ఫిర్యాదు నమోదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తనపై ఇలాంటి దారుణం జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇక సాధారణ మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని యువతి ఆరోపించింది. అయితే, యువతి ఆరోపణలను ఏసీపీ తప్పుపట్టారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. కానీ మోడల్ ఆరోపణలు మాత్రం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.