Begin typing your search above and press return to search.
ముంబయి లోకల్ లో తాగి రచ్చ.. రచ్చ చేసింది
By: Tupaki Desk | 18 Nov 2015 10:02 AM GMTబాగా చదువుకొన్నట్లుగా ఉన్న ఆ మహిళ పూటుగా తాగింది. ఆపై.. ముంబయి లోకల్ ట్రైన్ లో హడావుడి చేసింది. ఒంటి మీద బట్టల్లేని ఆమె దెబ్బకు థానే రైల్వేస్టేషన్ లో పెద్ద కలకలమే చోటు చేసుకుంది. థానేలోని నాలుగో నెంబరు ఫ్లాట్ ఫాంలో ఆమె రచ్చకు అక్కడి లోకల్ ట్రైన్ పదిహేను నిమిషాల పాటు రైలు ఆలస్యంగా నడిచింది.
సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారంలోకి వెళితే.. మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ ఒంటి మీద బట్టలు లేకుండా లోకల్ ట్రైన్ లోకి ఎక్కింది. పూటుగా తాగటం వల్ల ఆ మత్తులో పెద్ద పెద్దగా అరవటం మొదలెట్టింది. దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు ప్రయాణికులు ఆమెతో అనాగరికంగా వ్యవహరించి.. ఆమె ఫోటోలు తీసుకున్నారు.
ఈ కలకలాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెనువెంటనే స్పందించి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆమె ఒంటి మీద బట్టల్ని ఆమె తొలగించుకుందా? లేక.. ఎవరైనా ఆ దుశ్చర్యకు పాల్పడ్డారా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ విషయాన్ని తేల్చేందుకు రైల్వేస్టేషన్ లోని సీసీ కెమేరాల పుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక.. ఇంత రచ్చ చేసిన ఆ మహిళ ఎవరు? ఎందుకిలా చేసిందన్న వివరాలు బయటకు రాలేదు. మద్యం మత్తులో ఉన్న ఆమె.. తన వివరాలు వెల్లడించలేదని చెబుతున్నారు.