Begin typing your search above and press return to search.
డ్రంకైన్ డ్రైవ్ తనిఖీలకు వాట్సాప్ బ్రేక్
By: Tupaki Desk | 22 Nov 2016 9:26 AM GMT కొద్దికాలంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో హైదరాబాద్ లో మందుబాబులకు ముకుతాడు వేస్తున్న పోలీసులకు ఈ మధ్య పెద్దగా ఎవరూ దొరకడం లేదట... దీంతో జనం మారిపోయారు.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సూపర్ సక్సెస్ అయ్యాయని వారు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ, కాస్త ఆలస్యంగా వారికి ఓ నిజం తెలిసి షాకయిపోయారు. తాగుబోతుల తెలివికి పోలీసులు కూడా సెల్యూట్ అనాల్సి వచ్చింది.. ఇప్పుడు వారికి విరుగుడుగా కొత్త అస్త్రాలు వెతుకుతున్నారట.. ఇంతకీ హైదరబాదు మందుబాబులు వేసిన ఎత్తుగడ తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
తాగి వాహనాలు నడిపే మందుబాబుల కోసం చాలాకాలంగా పోలీసులు రాత్రిపూట డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. వారికి జరిమానాలు, శిక్షలు వేయడమే కాకుండా రద్దీగా ఉండే కూడళ్లలో రోజంతా నిలబెట్టి తాగి వాహనాలు నడపొద్దంటూ వారితో ప్రచారం చేయిస్తున్నారు. దీంతో చాలామంది ఇబ్బంది ఫీలవుతు కొత్త ఎత్తుగడ వేశారు. అందుకు టెక్నాలజీని వాడుకున్నారు. కొందరు తాగుబోతులు కలిసి ఒక ఉపాయం కనిపెట్టారు. మొదట వారంతా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఎక్కడ తనిఖీలు జరుగుతున్నా.. వెంటనే, ఆ సమాచారం గ్రూపులో షేర్ చేసుకోవడం ప్రారంభించారు. క్రమంగా గ్రూపు పెద్దదయింది.దాదాపుగా సిటీలో తాగి వాహనాలు నడిపేవారంతా ఇప్పడు ఆ గ్రూపులో మెంబర్లే... కారో , బైకో నడుపుతూ వాట్స్ యాప్ ఆన్ లో పెట్టుకోవడం... డ్రంకైన్ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలర్ట్ రాగా రూటు మార్చేయడం... ఇదీ ఇప్పుడు జరుగుతున్నది. మొత్తానికి మందుబాబులు, పోలీసుల దోబూచులాట బాగానే ఉంది.
కొసమెరుపు: హైదరాబాద్ లో ఉన్న ఈ తరహా వాట్స్ యాప్ గ్రూపు గురించి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ వారి ఫ్రెండ్సుకు తెలిసి ఈ ప్రాబ్లం ఉన్న ప్రతిచోటా కొత్తగా వాట్సాప్ గ్రూపులు మొదలయ్యాయట. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతలకు తరచూ వెళ్లే మందుబాబులైతే ఆ పట్టణాల్లోని మందుబాబుల వాట్సాప్ గ్రూపుల్లోనూ మెంబర్లుగా మారుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/