Begin typing your search above and press return to search.
కాకినాడ కుర్రాళ్ల దుర్మార్గం చూశారా?
By: Tupaki Desk | 27 March 2018 8:30 AM GMTమందుబాబుల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిగణిస్తున్న డ్రంకన్ డ్రైవ్‌పై ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా కూడా మందుబాబుల్లో చలనం కనిపించడం లేదు. అంతేకాదండోయ్... ఏకంగా మాకే బంధనాలు వేస్తారా? అంటూ ఖాకీలపై విరుకుపడటమే కాకుండా ఏకంగా దాడులకు దిగుతున్న మందుబాబుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గొంతులో చుక్క పడిందంటే చాలు.. తమను ఏ నిబంధనలు ఆపలేవన్న కోణంలో మందుబాబులు వీరవిహారం చేస్తున్న వైనం వైరల్‌గానే మారిపోయింది. ఈ తరహా దుర్మార్గం ఏదో మెట్రో సిటీలకే పరిమితం అయిందనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మెట్రోల్లో అంటే ప్రముఖులు, వారి పిల్లలు... డబ్బుకు ఏమాత్రం తక్కువ లేని పరిస్థితుల్లో జల్సాలకు అలవాటు పడి ఉంటారనుకోవచ్చు. అయితే చిన్న నగరాలు, పట్టణాల్లోనూ ఇప్పుడు మందుబాటుల ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయనే చెప్పాలి. ఈ తరహా ఘటనల్లో మందుబాబులను అదుపు చేసేందుకు రంగంలోకి దిగుతున్న పోలీసుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతున్న వైనం ఆందోళన కలిగించేదే.
ఇలాంటి ఘటనే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో చోటుచేసుకుంది. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ ఘటన మందుబాబుల దుర్మార్గాన్ని కళ్లకు కడుతోంది. మందుబాబులు ఈ మేర రెచ్చిపోతే... ఇక డ్యూటీలు చేసేదెలా? అన్న కోణంలో పోలీసులు కూడా తమ భద్రతపై దృష్టి సారించక తప్పని పరిస్థితి. ఇక ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ బడా బాబుల ఫ్యామిలీస్ కు చెందిన ఓ ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఇంటి వద్ద కారులో బయలుదేరి నేరుగా బార్ లో ల్యాండయ్యారు. అక్కడ ఫుల్లుగా మద్యం సేవించి అదే కారులో తిరుగు పయనమయ్యారు. రిటర్న్ జర్నీలో వారు జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచే వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఎస్పీ ఆఫీస్ ఎదుట రహదారిపై సాధారణ తనిఖీలను ప్రారంభించిన పోలీసులు... వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. అప్పటికే ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు తమ కారును ఆపేందుకు ససేమిరా అన్నారు. అసలు పోలీసులు తమ కారు వద్దకు రాకూడదనే ఉద్దేశ్యంతో వారు కారును అస్సలు ఆపలేదు.
అయితే సదరు కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారన్న విషయాన్ని గ్రహించిన పోలీసులు... ఓ నలుగురైదుగురు వచ్చి కారును చేతులనే అడ్డం పెట్టి ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని కారుతోనే నెట్టుకుంటూ ముందుకు కదిలిన విద్యార్థులను ఆపేందుకు ఓ సివిల్ కానిస్టేబుల్... పక్కనే ఉన్న బారీకేడ్‌ను కారుకు అడ్డంగా పెట్టే యత్నం చేశారు. అయితే ఇవేవీ పట్టని మందుబాబులు బారీకేడ్ తో పాటు దానిని అడ్డంగా పెట్టిన కానిస్టేబుల్‌ను ఢీకొట్టేసుకుంటూ కారు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో బారీకేడ్ పక్కకు పడిపోగా... దానిని అడ్డంగా పెట్టిన కానిస్టేబుల్ మాత్రం కారు కింద పడిపోయారు. అయినా కూడా ఆగని మందుబాబులు కానిస్టేబుల్ ను తొక్కించుకుంటూనే ముందుకు సాగారు. ఈ ఘటనలో కారు కింద పడ్డ సివిల్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా... ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక కారును అడ్డుకునే యత్నంలో భాగంగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా గాయపడ్దాడు. ఇంత జరిగినా... సదరు మందుబాబులు ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. సీసీ టీవీ ఫుటేజీలను బయటకు తీసిన పోలీసులు... మందు కొట్టి నానా బీభత్సం చేసిన ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు ఎవరన్న విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారిపోందని చెప్పాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి