Begin typing your search above and press return to search.

లేడీస్ హాస్టల్ దగ్గర మంత్రిగారబ్బాయి హల్ చల్!

By:  Tupaki Desk   |   1 Aug 2016 10:57 AM GMT
లేడీస్ హాస్టల్ దగ్గర మంత్రిగారబ్బాయి హల్ చల్!
X
తండ్రులు రాజకీయ నాయకులు అవ్వడం లేదా సమాజంలో డబ్బు - పేరుప్రతిష్టలు సంపాదించిన వారుగా ఉండటం.. వారి పుత్రరత్నాలు మాత్రం వారి వారి తండ్రుల పేర్లు నాశనం చేస్తూ వారిని ఇరుకునపెట్టడం ఈ మధ్యకాలంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ పుత్రరత్నాలు చేసే పనికిమాలిన పనులవల్ల ఆ తండ్రులు గౌరవంతోపాటు మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు. అది వారి పెంపకంలో లోపమా లేక వీరి మనస్థత్వానికి ప్రతిరూపమా అనేది మాత్రం రహస్యంగానే ఉంటుంది.

ఎయిర్ పోర్టులో ప్రభుత్వ అధికారులపై చేయిచేసుకున్నా, తాగేసి రోడ్లపై యాక్సిడెంట్లుచేసి ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకున్నా, నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలను వెంబడిస్తూ వేదించినా.. ఇది కొంతమంది రాజకీయనాయకుల - మంత్రుల పుత్రరత్నాలకే చెల్లింది. వీరి సరసన తాజాగా మరో మంత్రిగారి పుత్రరత్నం చేరాడట!

వివరాళ్లోకి వెళితే... తాజాగా ఏపీకి చెందిన ఒక మంత్రిగారి కుమారుడు పీకలదాకా తాగి అర్ధరాత్రి పూట వీరంగం సృష్టించాడట. తాగినోడు తాగినట్లుండక.. అర్ధరాత్రి సమయంలో లేడీస్ హాస్టల్ లోకి చొరబడే ప్రయత్నం చేశాడట. ఈ హడావిడి గమనించిన పక్కనే ఉన్నబాయ్స్ హాస్టల్ యువకులు - సిబ్బంది వచ్చి ఇతడిని అడ్డుకునే ప్రయత్నంచేశారట. ఈలోపు పోలీసులకు సమాచారం అందడంతో హాస్టల్ కు వచ్చిన పోలీసులు అతడిని పట్టుకున్నారట. అయితే ఇతడు సమాన్యుడి కొడుకు కాదు - సాదారణ పౌరుడి బిడ్డ కాదు కాబట్టి పోలీసులు అరెస్టు చేసే సాహసానికి ఒడికట్టకుండా... మంత్రిగారి పుత్రరత్నం కావడంతో మందలించి పంపేశారనేది విశ్వసనీయవర్గాల సమాచారం.