Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్:డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న మందుబాబులు..వైరల్ అవుతున్న పిక్స్!

By:  Tupaki Desk   |   20 March 2020 3:30 PM GMT
కరోనా ఎఫెక్ట్:డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న మందుబాబులు..వైరల్ అవుతున్న పిక్స్!
X
ప్రపంచంలోని ప్రతి దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ..ఒక విషయం లో మాత్రం మనకి మంచి చేసింది అనే చెప్పాలి. కరోనా దెబ్బకి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రూల్స్ సరిగ్గా పాటిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా కరోనా నుండి తప్పించుకోవడాని ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. సాధారణంగా మన దేశంలో ఉన్న ఎక్కువ శాతం మంది ప్రభుత్వం చెప్పే రూల్స్ ని పాటించరు. చివరికి దైవ దర్శనం కోసం వెళ్లిన సమయంలో కూడా క్యూ పాటించరు. ఇక బస్సులు - రైళ్లలో - ముఖ్యంగా మందు షాప్స్ ల ముందు అయితే ఉండే ఆ హడావిడే వేరు. అయితే ఈ కరోనా దెబ్బకి సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని సూచనలు జారీచేసింది. ముఖ్యంగా ఎక్కువమంది ఒకే చోట గుమ్మికూడదు ..ఎవరితో అయిన మాట్లాడేటప్పుడు మూడు అడుగుల దూరంలో నిల్చొని మాట్లాడటం మంచిది అని , అలాగే శానిటైజర్ తో చేతులని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని తెలిపింది. మొదట్లో ఈ నియమాలని పెద్దగా పాటించకపోయినప్పటికీ కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్న వార్తలు వినిపించినప్పటినుండి అందరూ ఈ నియమాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రానికి చెందిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. అందరూ చాలా పద్దతిగా ఒక్కొక్కరి మధ్యలో రెండు అడుగుల దూరం ఉండేలా చూసుకొని మరి నిలబడ్డారు. అంత పద్దతిగా నిలబడ్డారు కాబట్టి ..వారు ఏదో పరీక్షలు రాయడానికో - ఏ రేషన్‌ షాపు దుకాణం ఎదుటో నిలబడ్డారులే అనుకుంటే పొరపాటే...ఆలా చాలా పద్దతిగా వారు నిలబడింది మద్యం షాపు ముందు. కేరళల మందుబాబులు సామాజిక ఎడం పాటిస్తూ క్యూ లైన్‌ కట్టిన ఫొటోలు - వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకరికి మరొకరికి మధ్య ఒక మీటర్‌ ఎడం పాటిస్తూ నిలబడ్డారు. అందుకనువుగా మద్యం దుకాణం ఎదుట క్యూలైన్‌ లో ముగ్గుతో గీతలను కూడా గీసి ఉంచడం విశేషం. ఈ క్యూలైన్‌ లో ముఖాలకు చేతులు అడ్డుపెట్టుకుని కొందరు - కర్చీఫ్‌ కట్టుకుని మరికొందరు కనిపిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అవన్నీ దండగ అనుకున్నాడో ఏమో కానీ - నా రూటే సెపరేటు అంటూ ఏకంగా హెల్మెట్‌ ధరించి వరుసలో నిలబడ్డాడు. అలాగే పలు రైల్వే స్టేషన్స్ - బస్ స్టాండ్స్ లో కూడా టికెట్ కౌంటర్ల ముందు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ..తమ పక్కన ఉన్నవారికి దూరం మెయిన్ టైన్ చేస్తున్నారు . మొత్తంగా కరోనా రాకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు చర్యలని చూస్తున్న నెటిజన్స్ ...దీన్ని ఇలాగే కొనసాగిస్తే ..ఇండియా చాలా త్వరగా అభివృద్ధి లో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ విధమైన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.