Begin typing your search above and press return to search.

అధినేత పై హాట్ కామెంట్స్ చేసిన డీఎస్ ...వ్యూహంలో భాగమేనా !

By:  Tupaki Desk   |   24 Jan 2020 7:02 AM GMT
అధినేత పై హాట్ కామెంట్స్ చేసిన డీఎస్ ...వ్యూహంలో భాగమేనా !
X
టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతాం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఆయన టి ఆర్ ఎస్ అధిష్ఠానాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో కాక రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు డి.ఎస్. పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తూ, సీఎం కేసీఆర్‌ కు గతంలో లేఖ రాశారు. తప్పు చేస్తే చర్య తీసుకోవాలని చెప్పిన డి.ఎస్., అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు డి.ఎస్. కు ఆహ్వానం అందకపోవడంతో ఆయన కూడా అప్పటినుండి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు కాకుండా బీజేపీ తరపున పోటీ చేసిన తన తనయుడు, అర్వింద్ గెలుపు కోసం ఇంటర్నల్ గా పనిచేశారనే ఉద్దేశ్యంతో పూర్తిగా డి.ఎస్. ను పార్టీ పక్కన పెట్టింది.

అలాగే సందర్భం లో డి.ఎస్. పార్టీ కి, రాజ్యసభ పదవి కి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలపై డిఎస్ సైతం గట్టిగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఒక్క పార్టీలో నే కాదు ..మొత్తం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి డిఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శ చేయడం పై, డిఎస్ డైరెక్ట్ గా పార్టీ పై ఎదురు దాడి చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు డి. శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నా కూడా అయన పార్టీ అధినేత పై విమర్శలు చేయలేదు. కానీ , తాజాగా కేసీఆర్ కుటుంబం పై తీవ్ర స్థాయి లో విరుచుకు పడటం చూస్తే, పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. అలాగే కేసీఆర్‌ కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాలు కూడా విసరడం తో అయన ఎదో పెద్ద వ్యూహంతోనే మాట్లాడుతున్నారు అని చర్చ నడుస్తుంది.

మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు డి.ఎస్. టీ ఆర్ ఎస్ ను టార్గెట్ చేయడాన్ని, బట్టి చూస్తే ఎన్నికలలో గులాబీ పార్టీ విజయావకాశాలని దెబ్బ కొట్టాలనే లక్ష్యం తోనే ఆలా మాట్లాడినట్టు అర్థమౌతుంది. ఇటు టీఆర్ఎస్ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డి.ఎస్. పై మంత్రి చేసిన విమర్శలు ఆయనకు కోపం తెప్పించినప్పటికీ బలమైన సామాజిక వర్గం ఓటర్లు టీఆర్ ఎస్ కు దూరం చేసేందుకు ఆయన, ఆ రేంజ్‌ లో ఫైర్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది.అయితే సొంత పార్టీ నేతనే పార్టీ అధిష్ఠానంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన నేపథ్యం లో అధినేత నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.