Begin typing your search above and press return to search.
బాబు వస్తే జాబు రాలేదు సీఎంగారూ
By: Tupaki Desk | 7 Sep 2015 12:14 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎవరైనా కనిపిస్తే.. నాటకీయంగా వారి దగ్గరకు వెళ్లిపోయి.. నీ సమస్యలేందంటూ మాట్లాడేయటం.. అవతలి వారు ఇచ్చే షాకింగ్ సమాధానంతో ఒక్కసారి కంగుతినటం బాబుకు కొత్తేం కాదు. గతంలో పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఇలాంటి అనుభవాలు చాలానే అయ్యాయి.
ఆదివారం వైజాగ్ నగర్ పర్యటన సందర్భంగా ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఆరు గంటల పాటు విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేసిన చంద్రబాబు.. గతంలో ఆయన మార్క్ గా ఉండే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న చేపల మార్కెట్ కు వెళ్లారు. అక్కడున్న ఒక యువకుడి వద్దకు సరాసరిన వెళ్లిన చంద్రబాబు.. నీ సమస్యలేంటని ప్రశ్నించారు.
చేపలు అమ్ముకునే కుర్రాడి దగ్గర ఏ రేషన్ కార్డో.. పక్కా ఇల్లు లేదనో అనుకొని ఉన్నారేమో కానీ.. కాన్ఫిడెంట్ గా సమస్యను అడిగేశారు. కానీ.. ఊహించని విధంగా బాబుకు షాక్ తగిలే సమాధానం ఒకటి బయటకు వచ్చింది. సదరు చేపలు అమ్ముతున్న కుర్రాడు మాట్లాడుతూ.. తన పేరు త్రినాథ్ అని.. తాను 2014 డీఎస్సీలో క్వాలిఫై అయ్యానని.. 45వ ర్యాంకు వచ్చిందని.. ఇప్పటివరకూ పోస్టింగ్ లేక ఎదురుచూస్తున్నట్లు చెప్పటంతో బాబు గతుక్కుమన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బాబు వస్తే.. జాబు పక్కా అంటూ సినిమా డైలాగును చెప్పిన చంద్రబాబుకు.. డీఎస్సీలో 45వ ర్యాంకు సాధించిన నెలలు గడుస్తున్నా.. పోస్టింగ్ రాకపోవటం లాంటి మాటను అడిగి మరీ చెప్పించుకోవటం బాబుకే చెల్లింది. త్రినాథ్ సమాధానంతో గతుక్కుమన్న బాబు.. వారంలో డీఎస్సీ పోస్టింగులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పి పక్కకు వెళ్లారు. మొత్తానికి బాబు వస్తే జాబు రాలేదన్న విషయాన్ని ఆయనకే నేరుగా చెప్పేయటానికి మించిన మహా ఇబ్బంది మరొకటి ఉండదేమో.