Begin typing your search above and press return to search.

క్రికెట్ కంటే పోలీస్ డ్యూటీనే కష్టమంటున్న క్రికెటర్

By:  Tupaki Desk   |   12 April 2020 2:30 AM GMT
క్రికెట్ కంటే పోలీస్ డ్యూటీనే కష్టమంటున్న క్రికెటర్
X
అది 2007 ప్రపంచకప్.. ఎంఎస్ ధోని సారథ్యంలో ఇండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. ప్రత్యర్థి భీకరమైన పాకిస్తాన్. చివరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు బౌలర్ జోగిందర్ శర్మ. క్రికెటర్ గా రాణించిన ఈయనకు హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చింది. 2018 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన జోగిందర్ అనంతరం క్రికెట్ కు వీడ్కోలు పలికి హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు.

తాజాగా దేశంలో కరోనా నేపథ్యంలో పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో పోలీస్ డ్యూటీ భయంగా ఉన్నా దేశం కోసం సేవ చేస్తున్నాననే ఫీలింగ్ ముందుకు నడిపిస్తుందని జోగిందర్ శర్మ అన్నాడు. క్రికెట్ కంటే పోలీస్ ఉద్యోగం చాలా కష్టంగా ఉందన్నాడు. తాను 24 గంటలు డ్యూటీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. హిసార్ జిల్లాలో డ్యూటీ చేస్తున్నానని.. అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తున్నాన్నారు.

యూపీ, బీహార్ వలస కూలీలు కాలినడకన పెద్ద ఎత్తున వచ్చినప్పుడు భయపడ్డానని జోగిందర్ శర్మ తెలిపాడు. కరోనా భయంతో కుటుంబ సభ్యులకు అంటుతుందేమోనన్న భయంతో ఇంటికి వెళ్లకుండా హిసార్ లోనే ఉంటున్నానని తెలిపారు.