Begin typing your search above and press return to search.

ఎటు కావాలంటే అటు తిప్పేసే బిల్డింగ్

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:31 AM GMT
ఎటు కావాలంటే అటు తిప్పేసే బిల్డింగ్
X
ప్రపంచంలోనే ఎత్తైన భవనం ఎక్కడా అన్న వెంటనే.. తడుముకోకుండా దుబాయ్ అని చెప్పేస్తారు. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో మరో భారీ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు అదే దేశంలో. అయితే.. అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫా అంత ఎత్తులో కాకున్నా.. ఆ స్థాయిలోనే ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అసలు ముచ్చట ఏమిటంటే.. ఈ భవనం ప్రత్యేకతల గురించి వింటే నోటివెంట మాట రాదంతే.

ఆశ్చర్యాన్ని నింపే ఈ బిల్డింగ్ గొప్పను ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ భారీ భవనంలోని ప్లాట్లను ఎటు కావాలంటే.. అటు తిప్పుకునే సౌకర్యం ఉండటం. అదెలా అంటారా? ఉదయాన్నే మీరున్న గదిలో సూర్యోదయాన్ని మాత్రమే కాదు.. సర్యాస్తమయాన్ని కూడా చూసే వీలుంటుంది. అదే దీని గొప్పతనం. ఇలాంటి విలక్షణ నిర్మాణాన్ని దుబాయ్ లో వేగంగా నిర్మిస్తున్నారు.

దుబాయ్ లోని డైనమిక్ టవర్ హోటల్ లో ఒక్కో అంతస్తుల్లో దేనికవే విడివిడిగా ఉండే ఫ్లోర్లను నిర్మిస్తున్నారు. ముందుగా మధ్య భాగంగా నిర్మించిన ఎత్తైన కాంక్రీట్నిర్మాణానికి వేరే చోట తయారు చేసిన యూనిట్లనుతీసుకొచ్చి జాయింట్ చేస్తూ.. ఈ భారీ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు.

తన చుట్టూ తాను తిరిగేలా డిజైన్ చేసిన ఆ భారీ భవనం.. నిర్మాణ రంగంలోని ఒక కొత్త సంచలనంగా చెబుతున్నారు. ఆకాశ హర్మ్యాలలో ఈ తరహా భవనం మరెక్కడా లేదన్న మాటను చెబుతున్నారు. ఎయిర్ ఫ్యాన్స్.. సోలార్ ప్లేట్స్ సాయంతో ఈ భవనానికి అవసరమైన విద్యుత్ను సొంతంగా తయారు చేయటం మరో ప్రత్యేకతగా చెప్పాలి.

మొత్తం 80 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భారీ భవనం ఎత్తు జస్ట్ 1375 అడుగులు మాత్రమే. అంటే.. ఈ భవనంలోని 75వ అంతస్తులో రూమ్ తీసుకున్న వారు. తమ రూమ్ ని 360 డిగ్రీల్లో తిప్పేసుకునే వీలు ఉంటుందన్న మాట. ఈ గదిలో ఉండేవారికి ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే.. ఆకాశంలో ఇష్టం వచ్చినట్లుగా తిరిగేస్తూ ఎంజాయ్ చేసే వీలు ఉంటుందన్న మాట. ఈ థాట్ ఎంతోమంది రొమాంటిక్ జీవుల్ని ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/