Begin typing your search above and press return to search.

మ‌న టీవీల్లో అలా.. దుబాయ్ మీడియాలో ఇలా!

By:  Tupaki Desk   |   26 Feb 2018 4:51 AM GMT
మ‌న టీవీల్లో అలా.. దుబాయ్ మీడియాలో ఇలా!
X
అతిలోక సుంద‌రి మ‌ర‌ణం ఏమో కానీ.. టీవీ ఛాన‌ళ్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. శ్రీ‌దేవి మ‌ర‌ణ వార్త తెలిసిన క్షణం నుంచి బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేస్తున్న టీవీ ఛాన‌ళ్ల కు ఇప్పుడో కొత్త స‌మ‌స్య నెత్తి మీద‌కు వ‌చ్చింది. గ‌డియాంలో గంట‌లు గ‌డిచిపోతున్నా.. దుబాయ్ నుంచి ఎలాంటి అప్డేట్ రాని ప‌రిస్థితి.

గంట‌ల కొద్దీ వెయిట్ చేస్తున్నా ఎలాంటి అప్ డేట్ లేదు. అప్ప‌టికే ఎన్ని ర‌కాలుగా అతిలోక సుంద‌రిని క‌వ‌ర్ చేశామో.. అన్ని ర‌కాలుగా క‌వ‌ర్ అయిపోయాయి. ఆమె పాట‌లు.. ఆమె గురుతులు.. ఆమె జీవితం.. ఆమె కెరీర్.. ఇలా అన్నింటి గురించి నాన్ స్టాప్ గా చెబుతున్న ఛాన‌ళ్ల‌కు బోర్ కొడుకున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. శ్రీ‌దేవి గురించి స‌రికొత్త‌గా ఏం చెప్పాల‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఇందులో భాగంగానే.. 54 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే కార్డిక్ అరెస్ట్ కు కార‌ణం.. ఆమె సౌంద‌ర్యారాధ‌నేనా? అంటూ కొత్త సందేహాన్ని ఎవ‌రో ఒక ఛాన‌ల్ తీసుకొచ్చింది. అంతే.. దాన్ని అల్లేసుకొని బ్యూటీషియ‌న్ల‌ను.. వైద్యుల్ని స్టూడియోల‌కు పిలిపించి చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు. మ‌ధ్యాహ్నం 5 గంట‌ల వేళ‌కు శ్రీ‌దేవి పార్థిప‌కాయం ముంబ‌యికి చేరుకుంటుంద‌న్న బ్రేకింగ్‌ ను వేశారు.

ఇదిలా ఉంటే.. స‌రిగ్గా 2.30 గంట‌ల వేళ‌కు టీవీ ఛాన‌ళ్లు కొన్ని శ్రీ‌దేవి పార్థిక‌దేహానికి ఫోరెన్సిక్ క్లియ‌రెన్స్ పూర్తి అయిన‌ట్లుగా బ్రేకింగ్ లు వేసేశారు. ఇందులో ఉన్న‌ది ఎంత‌వ‌ర‌కు నిజమ‌న్న విష‌యాన్ని చెక్ చేసే క్ర‌మంలో దుబాయ్ మీడియా సంస్థ‌ల వార్త‌ల్ని చూసిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఒక‌టి క‌నిపించింది. దాదాపు మ‌ధ్యాహ్నం 2.26 గంట‌ల వేళ‌లో శ్రీ‌దేవి లైవ్ అప్ డేట్స్ లో భాగంగా ఒక ట్వీట్ చేశారు. దాని ప్ర‌కారం ఆ క్ష‌ణం వ‌ర‌కూ కూడా శ్రీ‌దేవి పార్థిప‌కాయం దుబాయ్ ఫోరెన్సిక్ కు చెందిన ప్ర‌ధాన కార్యాల‌యంలోని మార్చురీలోనే ఉంద‌ని పేర్కొంది. అంతేకాదు..క్లియ‌రెన్స్ కోసం మ‌రికొద్ది గంట‌ల టైం ప‌ట్టొచ్చ‌ని పేర్కొంది.

ఇప్ప‌టికే అధికారిక ప్రొసీజ‌ర్ పేరుతో గంట‌ల కొద్దీ టైం గ‌డిపేస్తున్న వేళ‌.. తాజాగా మ‌రికొన్ని గంట‌ల ఆల‌స్యం అవుతుంద‌న్న మాట దేశ ప్ర‌జ‌ల‌కు మ‌రింత వేద‌న‌కు క‌లిగించే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

దుబాయ్ మీడియా స‌మాచారం నిజ‌మైతే.. ఇప్ప‌టివ‌ర‌కూ అనుకుంటున్న‌ట్లు ఈ సాయంత్రం 5 గంట‌ల వేళ‌కు కాకుండా.. రాత్రికి మాత్ర‌మే శ్రీ‌దేవి భౌతిక‌కాయం ముంబ‌యికి వ‌స్తుంద‌ని చెప్పాలి. శ్రీ‌దేవి త‌ర‌లింపు మ‌న టీవీ ఛాన‌ళ్ల‌లో ఒక‌లా.. దుబాయ్ మీడియాలో మ‌రోలా రావ‌టం ఏమిటో? ఏదో కొత్త‌ద‌నంగా ఉండాల‌న్న త‌ప‌న కంటే.. ఇలాంటి వేళ‌లో.. క‌చ్ఛిత‌త్వం మీద అత్యుత్సాహ‌పు ఛాన‌ళ్లు దృష్టి సారిస్తే బాగుంటుంది క‌దా.