Begin typing your search above and press return to search.
బీహార్ ఎన్నికలతో పాటే దుబ్బాక ఉప ఎన్నిక !
By: Tupaki Desk | 4 Sep 2020 5:30 PM GMTబీహార్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశంలో పెండింగ్ లో ఉన్న 65 స్థానాలకు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించబోతున్నట్టు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. వివిధ రాష్ట్రాల శాసనసభలలో 64 స్థానాలకు అదేవిధంగా ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సివుంది. కేంద్ర బలగాల మోహరింపు ఇతర కారణాలతో రెండింటిని ఒకేసారి నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది . ప్రస్తుత బిహార్ అసెంబ్లీ నవంబర్ 29వ తేదీతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీకి అక్టోబర్-నవంబర్ లో ఈసీ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నధం అవుతుంది.
ఈ నేపథ్యంలో బీహార్ సాధారణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కరోనా వైరస్ అధిక వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలు ఇటీవల వాయిదా పడ్డాయి. ఇక , తెలంగాణ మన రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ ఎస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గుండెజబ్బుతో మరణించారు. దీనితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. మొత్తంగా నవంబర్ నెలాఖరులోగా బీహార్ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున..దేశవాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉప ఎన్నికలను కూడా అదే సమయంలో నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధం అవుతోంది.