Begin typing your search above and press return to search.
ట్రంప్ టీంలో ఇంకో ఉద్యోగి బై బై చెప్పేశాడు
By: Tupaki Desk | 31 May 2017 4:29 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా తమ బాధ్యతలకు గుడ్‌బై చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో డొనాల్డ్ ట్రంప్ కమ్యునికేషన్ డైరెక్టర్ మైక్ డుబ్కే తన పదవికి రాజీనామా చేశారు. మే 18న తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించి రాజీనామా లేఖ రాసిన ఆయన ఆ సమయంలో ట్రంప్ తొలి పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అలాగే ఉండిపోయారు. ట్రంప్ పర్యటన నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
అయితే మైక్ స్థానంలో మరోకొత్త వ్యక్తిని సామరస్యపూర్వక వాతవరణంలో నియమించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా ఆ బాధ్యతల్లో కొనసాగిస్తు న్నారు. ఏ తేదీన ఆయన బాధ్యతలు వదులుకోవాల్సి ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి విధులకు హాజరవుతున్నారు. 'అధ్యక్షుడు ట్రంప్ వద్ద, ఆయన పరిపాలన వర్గంలో పనిచేసే అదృష్టం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇక ప్రస్తుతం ఇక్కడ నా విధులకు స్వస్తి పలికి గతంలో నేను పనిచేసిన బ్లాక్ రాక్ గ్రూప్‌లో తిరిగి కమ్యునికేషన్, ప్రజాసంబంధాల శాఖలో పనిచేసేందుకు వెళుతున్నాను' అంటూ తన స్నేహితులకు ఈమెయిల్స్ ద్వారా మైక్ చెప్పారు.
ట్రంప్ వద్ద మైక్ గత మూడు నెలలుగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం గోప్యతకు సంబంధించిన సమాచారం రష్యాకు ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తున్నారని ట్రంప్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని తుడిచివేసుకునే ప్రయత్నంలో భాగంగానే తాజాగా మైక్‌తో రాజీనామా చేయిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/