Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 10 Nov 2015 6:14 AM GMTవరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దుగ్యాలను పార్టీలో చేర్చుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి హరీశ్ రావుతో దుగ్యాల మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టగా తీసుకున్నకాంగ్రెస్ ఈ వ్యవహారంతో అందోళనలో పడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు దుగ్యాలను సంప్రదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాన్ని ఢిల్లీ పెద్దలకు చేరవేసినట్లు తెలుస్తోంది.
టీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దుగ్యాల శ్రీనివాస రావు వైఎస్ హాయంలో ...ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ సమయంలో వైఎస్ నిర్వహించిన ఆపరేషన్ వల్ల 11 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా అందులో దుగ్యాల కూడా ఉన్నారు. దీన్ని ఖండిస్తూ అప్పట్లో టీఆర్ ఎస్ ప్రజాకోర్టులు నిర్వహించింది. అప్పటి స్పీకర్ సురేశ్ రెడ్డి వీరిలో పలువురిపై అనర్హత వేటు వేశారు. గత ఎన్నికల్లో పాలకూర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసిన దుగ్యాల.... టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి చేతిలో ఓడిపోయారు.