Begin typing your search above and press return to search.

కార్లపై 'దుల్హన్ హమ్ లే జాయేంగే' స్టిక్కర్లు.. కట్ చేస్తే..!

By:  Tupaki Desk   |   11 Aug 2022 9:04 AM GMT
కార్లపై దుల్హన్ హమ్ లే జాయేంగే స్టిక్కర్లు.. కట్ చేస్తే..!
X
రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఆదాయపన్ను అధికారులు.పెద్ద ఎత్తున ఆదాయపన్ను ఎగ్గొట్టే వ్యాపారుల సంగతి చూసేందుకు వారు వినూత్నంగా వ్యవహరిస్తూ పన్ను ఎగ్గొట్టే వ్యాపారులకు దిమ్మ తిరిగే షాకిస్తున్నారు.

తాజాగా మహారాష్ట్రలోని జల్నా.. ఔరంగాబాద్ నగరాల్లో ఐటీ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది కోట్ల రూపాయిల పన్ను చెల్లించని మొత్తాల్ని పట్టుకుంటున్నారు. అయితే.. ఈ తప్పుడు వ్యాపారుల్ని పట్టుకునేందుకు ఐటీ అధికారులు భారీ ప్లాన్ వేశారు.

అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్.. స్టీల్.. వస్త్ర వ్యాపారాలు చేస్తున్న ఒక వ్యాపారికి సంబంధించిన వివిధ చోట్ల ఐటీ అధికారులు ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించారు.

సదరు వ్యాపారికి అనుమానం రాకుండా ఉండేందుకు వీలుగా 'దుల్హన్ హమ్ లే జాయేంగే' అంటూ తమ కార్లకు స్టిక్కర్లు అంటించుకున్నారు. తాము పెళ్లి వారమన్న భావన కలిగేలా చేసి.. సదరు వ్యాపారి గుట్టు రట్టు చేసింది.

ఆగస్టు ఒకటి నుంచి 8 వరకు నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.390 కోట్ల విలువైన చట్టవిరుద్దమైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మొత్తంలో రూ.58 కోట్ల క్యాష్ తో పాటు 32 కేజీల బంగారం బయట పడింది.

వ్యాపారి వద్ద స్వాధీనం చేసుకున్న రూ.58 కోట్ల నగదును లెక్కించటానికి అధికారులకు ఏకంగా 13 గంటల పాటు పట్టింది.మొత్తం 260 మంది ఐటీ విభాగానికి సంబంధించిన అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ ఉదంతం మహారాష్ట్ర ఐటీ విభాగంలో పెను సంచలనంగా మారింది.