Begin typing your search above and press return to search.
డమ్మీ ఈవీఎం..ఓట్ల ట్యాంపరింగ్..ఆప్ హడావుడి
By: Tupaki Desk | 9 May 2017 1:34 PM GMTఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం)ను రిగ్గింగ్ చేసే యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇవాళ ఆ మెషిన్లను ఎలా బోల్తా కొట్టించవచ్చో చేసి చూపించింది. దీనికోసం ఏకంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి మరీ ఆ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఈవీఎంను భరద్వాజ్ అసెంబ్లీకి తీసుకొచ్చారు. తానో కంప్యూటర్ ఇంజినీర్‌నని, తాను కూడా ఈ మెషిన్లను రిగ్ చేయగలిగానని ఆయన చెప్పారు. నేను ఎమ్మెల్యే కాక ముందు పదేళ్లు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్‌గా చేశాను. దేశ ప్రజాస్వామ్యాన్ని నిర్మించే మెషిన్లను నాలాంటి ఓ చిన్న ఇంజినీర్ కూడా హ్యాక్ చేయగలగడం శోచనీయం అని భరద్వాజ్ చెప్పారు.
ఓ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు ఈవీఎంలను బోల్తా కొట్టించవచ్చని భరద్వాజ్ వెల్లడించారు. ఓటింగ్‌కు ముందు రోజు మాక్ టెస్ట్‌లో ఈసీ అభ్యర్థులను ఫూల్స్‌ను చేస్తుందని ఆయన అన్నారు. డెమోలో భాగంగా మొదట ఆయన సాధారణ మెషీన్లో ఐదు పార్టీలకు రెండేసి ఓట్లు వేయగా.. అవన్నీ సరిగ్గానే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన ఓ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేశారు. తర్వాత వేసిన ఓట్లన్నీ ఒకే అభ్యర్థికి వెళ్లడాన్ని ఆయన చూపించారు. యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లోనూ బీజేపీకి చెందిన కార్యకర్త ఒకరు ఓటు వేయడానికంటూ వచ్చి ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేశారని, ఆ తర్వాత ఓట్లన్నీ ఆ పార్టీకే పడ్డాయని భరద్వాజ్ చెప్పారు.
అయితే ఈ డెమోని ఎన్నికల సంఘం తేలిగ్గా తీసుకుంది. ఆప్ ఓ డమ్మీ ఈవీఎంపై ఈ డెమో చూపించిందని, దీన్నే ఈసీ హ్యాకథాన్ చాలెంజ్‌లో చేసి చూపించాలని సవాలు విసిరింది. అసెంబ్లీలో డెమో సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత విజయ్ గుప్తా నిరసన తెలుపగా.. స్పీకర్ ఆయనపై ఒకరోజు సస్పెన్షన్ విధించి బయటకు పంపించారు.అయితే ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న ఈవీఎంలు కాకుండా.. తాను సొంతంగా తయారు చేయించుకుని వచ్చినవి కావడంతో వాటిని ఎంతవరకు నమ్మొచ్చని వచ్చిన ప్రశ్నలకు అటు భరద్వాజ్ గానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ సమాధానం ఇవ్వలేకపోయారు. అలాగే, సీక్రెట్ కోడ్‌ను ఈవీఎంలో ఎలా యాక్టివేట్ చేస్తారన్న ప్రశ్నలకు కూడా జవాబులు రాలేదు.