Begin typing your search above and press return to search.
బాలయ్య ఇంటి వద్ద 'డంపింగ్' వార్
By: Tupaki Desk | 28 Dec 2021 8:25 AM GMTబాలీవుడ్ అగ్రహీరో, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా హిందూపురంలోని బాలయ్య ఇంటి వద్ద ఈ మేరకు భారీగా పోలీసులు మోహరించారు. బాలయ్య ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలు దేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పట్టణంలో డంపింగ్ యార్డు మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు హిందూపురంకు చేసిందేమీ లేదని ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి వద్దే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అధికార వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి ముట్టడికి బయలు దేరారు. రెండు పార్టీల నేతలు బాలయ్య ఇంటికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో డంపింగ్ యార్డు తరలింపు తప్ప మరో అభివృద్ధి పని చేయలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్ చార్జ్ చంద్రమౌళి విమర్శించడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూపురంను నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిధులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలోనే రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. రెండు వర్గాలు బాలయ్య ఇంటివద్దే తేల్చుకుంటామని రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.