Begin typing your search above and press return to search.

యుద్ధం వేళ.. ఉక్రెయిన్ పెళ్లి.. ఇలాంటివి అక్కడే సాధ్యమేమో?

By:  Tupaki Desk   |   23 Jun 2022 4:41 AM GMT
యుద్ధం వేళ.. ఉక్రెయిన్ పెళ్లి.. ఇలాంటివి అక్కడే సాధ్యమేమో?
X
గడిచిన కొద్దిరోజులుగా రష్యా చేస్తున్న వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నదో ప్రశ్న. రోజులు వారాలుగా మారి.. నెలలుగా క్యాలెండర్ లో గడిచిపోతున్నప్పటికీ.. యుద్ధం మాత్రం ఒక కొలిక్కి రావటం లేదు.

రష్యా దాడిపై ఉక్రెయిన్లు ఎంత తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే పలు వార్తా సంస్థలు తమ రిపోర్టుల్లో చెప్పేశాయి. తాజాగా వైరల్ అయిన వీడియోను చూస్తే.. ఉక్రెయిన్లు ఇప్పుడెలాంటి మైండ్ సెట్లో ఉన్నారన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేయక మానదు.

దేశం కోసం సైనికులుగా మారుతున్న ఆ దేశంలో.. తాము మనువాడాలని భావించిన అమ్మాయి విషయంలో వారి తీరు కొత్త ఆలోచనల్ని రెకెత్తించేలా మారింది.

ఎలాంటి ఆర్బాటాలకు పోకుండా సింఫుల్ గా ఉంగరాలు మార్చుకుంటున్న వారు.. పెళ్లి వేళ సంప్రదాయ దుస్తుల్లో కాకుండా.. సైనిక దుస్తుల్లోనే పెళ్లాడటం ఈ పెళ్లి స్పెషల్ గా చెప్పక తప్పదు. మనసులోని ప్రేమను ఈ జంటను వ్యక్తపరుస్తూనే.. దేశం పట్ల తమకున్న కమిట్ మెంట్ ను చూపించిన వైనం కొత్త స్ఫూర్తిగా మారిందని చెప్పాలి.

ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక చిట్టి వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో చర్చి నుంచి బయటకు వచ్చిన కొత్త జంట.. పెళ్లి వేళ ధరించే తెల్లని వస్త్రాల స్థానే.. సైనిక దుస్తుల్ని ధరించి ఉండటం.

యుద్దం వేళ పరిస్థితుల్ని గుర్తుకు తెస్తుంటే.. అలాంటివేళలోనే దేశం కోసం పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పేశారు. అదే సమయంలో.. తమ మధ్య ఉన్న ప్రేమాభిమానాల్ని ప్రదర్శించిన వైనం చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేం. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావటంతో పాటు.. వార్ వేళ వావ్ అనే సన్నివేశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.