Begin typing your search above and press return to search.
హర్యానా హీరోను జీరో చేసిన వీడియో
By: Tupaki Desk | 26 Oct 2019 11:19 AM GMTహర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా దుష్యంత్ చౌతాలా ఇమేజ్ ఎంతలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో అధికార బీజేపీకి 40 స్థానాలు మాత్రమే లభించటం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొనటం తెలిసిందే. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను అందించే అపద్బాందవుడిగా మారారు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా.
బీజేపీకి మద్దతు ఇవ్వటంతో ఖట్టార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న పరిస్థితి. దీంతో.. నిన్నమొన్నటివరకూ పెద్దగా ఇమేజ్ లేని దుష్యంత్ ఇప్పుడు కింగ్ మేకర్ గా మారటమే కాదు.. ఆయన పాపులార్టీ భారీగా పెరిగింది. ఇలాంటివేళ.. దుష్యంత్ మాటలకు సంబంధించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. సదరు వీడియోలో ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తున్న వైనం ఉంది.
2002లో చోటుచేసుకున్న గుజరాత్ అల్లర్లపై ప్రధాని మోడీని విమర్శిస్తూ మాట్లాడిన దుష్యంత్.. గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం చేయలేకపోయిన మోడీ.. 1984 సిక్కువ్యతిరేక అల్లర్లపై ఎలా మాట్లాడతారా? అంటూ మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటల టేపుగా భావిస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు దుష్యంత్ ను తిట్టిపోస్తున్నారు. మరి.. మోడీని అంతగా తిట్టిన మీరు.. ఇప్పుడెలా ప్రభుత్వానికి మద్దతు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. తాను మాట్లాడిన వీడియోను ఆయన వెంటనే డిలీట్ చేస్తే మంచిదన్న సలహాను ఇస్తున్నారు.
గతంలో కేజ్రీవాల్ పార్టీతో పొత్తు పెట్టుకున్న దుష్యంత్ తొలి నుంచి మోడీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఆయన తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ప్రభుత్వానికి ఎలా మద్దతు ఇస్తారని.. ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం అవుతారని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకూ కింగ్ మేకర్ ఇమేజ్ తో ఉన్న ఆయన ఇవాళ మాత్రం అందుకు భిన్నంగా నోరు విప్పలేని పరిస్థితిలో ఉండటం చూస్తే.. గతం వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ వెంటాడుతుందన్న సత్యాన్ని మర్చిపోకూడదన్న నీతి గుర్తుకు రాక మానదు.
వీడియో కోసం క్లిక్ చేయండి