Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా దసరా సెలవులు

By:  Tupaki Desk   |   24 Sep 2019 7:16 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా దసరా సెలవులు
X
ఎంత విడిపోయినా కొన్ని విషయాల్లో ఒకేలాంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. కానీ.. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కొన్ని విషయాల్లో ఒకలా.. మరికొన్ని విషయాల్లో మరోలా వ్యవహరిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అయిన దసరాకు ఇచ్చే హాలీడేస్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరుగా సెలవులు ఇవ్వటం గమనార్హం.

కలిసి సాగుదాం.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దామనుకునే వేళ.. రెండు రాష్ట్రాల్లో సెలువు ఒకేలా ఉంటే.. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లి రావటానికి అనువుగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా సెలవులు ఉంటే.. రెండు రాష్ట్రాల మధ్య సెలవులకు వెళ్లిరావటం ఇబ్బందికరంగా ఉంటుంది.

తాజాగా దసరా సెలవులపై రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటన చేశాయి. ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు విద్యాశాఖ 12 రోజులు సెలువులు ప్రకటించింది. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరక దసరా సెలువులుగా ప్రకటించారు. అయితే.. దసరా సెలవుల్ని అక్టోబరు13 వరకూ పొడిగించాలని చెబుతున్నారు.

దీనికి కారణం లేకపోలేదు.. అక్టోబరు 10న స్కూళ్లు ఓపెన్ అయినా.. 11 ఒక్క రోజు మినహాయిస్తే 12న రెండో శనివారం.. 13న ఆదివారం. రెండు రోజులు వదిలేస్తే.. మొత్తంగా అక్టోబరు 13 వరకూ ఇస్తే సెలవులు బాగుంటాయని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ దసరా సెలవుల్ని అక్టోబరు 13 వరకూ ఇవ్వటం గమనార్హం. ఏపీలో మాదిరి సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 13 వరకూ సెలవుల్ని ప్రకటించారు. అంతే మొత్తం16 రోజుల. ఇదే రీతిలో ఏపీలోనూ సెలవులు ఇస్తే బాగుంటుందని.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. మరి.. దసరా సెలవుల విషయంలో తెలంగాణ బాటలో ఏపీ పయనిస్తుందో లేదో చూడాలి.