Begin typing your search above and press return to search.
వైరస్ భయానికి 10వేల జంతువుల బలి
By: Tupaki Desk | 8 Jun 2020 8:10 AM GMTకరోనా ముప్పు మనుషులనే కాదు.. జంతువులను కూడా హరిస్తోంది. మనిషి తన స్వార్థం కోసం ఇప్పుడు జంతువులను బలి తీసుకుంటున్న వైనం విస్తుగొలుపుతోంది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోయాయి. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకుతుందని తెలియడంతో చాలా గబ్బిలాలను హతమార్చారు. ఆ తరువాత పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాపిస్తుందని ప్రచారం జరగడంతో లక్షల పెంపుడు జంతువులను వాటి యజమానులు రోడ్డు పాలు చేశారు. చాలా చనిపోయాయి కూడా. తరువాత పెంపుడు జంతువుల వల్ల కరోనా రాదని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రస్తుతం మూగజీవాలపై వివక్ష మానుకున్నారు. అయినా సరే కరోనా భయంతో నెదర్లాండ్ ప్రభుత్వం అమానుషానికి దిగుతోంది. ఇప్పటివరకు మింక్ లు (కుందేలు లాంటి జంతువు) ద్వారా ఇద్దరు వ్యక్తులకు కరోనా వ్యాప్తి చెందినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. వాటి వల్ల మానవులకు వైరస్ ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడిన ప్రభుత్వం మింక్ లను హతమార్చాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్ ప్రభుత్వం దేశంలో మింక్ ఫార్మ్ లను అన్నింటిని నేలమట్టం చేయాలని.. 10వేల మింక్ లను చంపేసేందుకు సిద్ధమయ్యారు.