Begin typing your search above and press return to search.
మోడీపై దువ్వూరి వారి పొగడ్తలు విన్నారా?
By: Tupaki Desk | 5 Jan 2017 4:12 PM GMTనోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై అటురాజకీయ పక్షాలు మాత్రమే కాదు.. ఆర్థికవేత్తలు సైతం రెండు పక్షాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. మోడీ నిర్ణయంపై రాజకీయ నేతల మాటల్లో వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆర్థికవేత్తల మధ్య కూడా ఏ మాత్రం పొసగని రీతిలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్న సామాన్యులకు నోట మాట రాని పరిస్థితి.
ఆర్థిక రంగంలో ప్రముఖుల్లో ఒకరైన నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ లాంటి వారు నోట్ల రద్దు కార్యక్రమంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటాన్ని మర్చిపోకూడదు. మాజీ ప్రధాని.. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ సైతం నోట్ల రద్దుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. దాన్ని అమలు చేసే విధానాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా మన్మోహన్ చెప్పారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒకకార్యక్రమంలో పాల్గొన్న ఆర్ బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సబ్బారావు నోట్ల రద్దు నిర్ణయాన్ని కళాత్మకంగా పొగిడేయటం గమనార్హం. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం తీసుకున్న సృజనాత్మక విధ్వంసకచర్యగా ఆయన అభివర్ణించారు. కాకుంటే.. ఈ విధ్వంసక చర్య నల్లధనం మీదని.. బ్లాక్ మనీని కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో సాయం చేస్తుందన్నారు.
దేశ వ్యాప్తంగా చెలామణీలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా దేశంలో జరిగిన సృజనాత్మక విధ్వంసక చర్యగా ఆయన పేర్కొన్నారు. తాను ఎందుకలా చెబుతున్నానంటే.. నల్లధనాన్ని తెలివిగా నాశనం చేయటం అంత తేలికైన విషయం కాదని వ్యాఖ్యానించటం గమనార్హం. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుందని.. ఆర్థిక రంగం డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రయాణిస్తుందని చెప్పారు. మొత్తంగా మోడీ నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్న దువ్వూరి మాటలపై మోడీ నిర్ణయాన్ని విభేదిస్తున్న ఆర్థికవేత్తలు ఏమంటారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/