Begin typing your search above and press return to search.

విజయవాడ గ్యాంగ్‌ వార్‌ పై కీలక విషయాలు బయటపెట్టిన సీపీ !

By:  Tupaki Desk   |   5 Jun 2020 2:30 PM GMT
విజయవాడ గ్యాంగ్‌ వార్‌ పై కీలక విషయాలు బయటపెట్టిన సీపీ !
X
విజయవాడలో ఒక్కసారిగా కలకలం రేపిన గ్యాంగ్‌ వార్ ‌‌కు సంబంధించి రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు సందీప్‌, పండుకు మధ్య వివాదాలు చంపుకొనే స్థాయికి ఎందుకు చేరాయి? అసలు ఒక్కసారిగా కత్తులు దూసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయ్..? అనే విషయాలపై ఈ గ్యాంగ్ ‌వార్‌ లో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఈ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ గ్యాంగ్ వార్ లో ఇప్పటికే 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ గ్యాంగ్ వార్ గురించి తాజాగా విజయవాడ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ ..పలు కీలక విషయాలు వెల్లడించారు. నగరంలో ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. రోడ్లపై కొట్లాడే వాళ్లపై తీవ్ర చర్యలుంటాయ్ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ఇక ఈ గ్యాంగ్ వార్ గురించి మాట్లాడుతూ... తోట సందీప్, పండు ఒకప్పుడు స్నేహితులు. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌ మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదమే ఘర్షణకు కారణం అని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించాం అని, 13 మంది నిందితుల నుంచి కొబ్బరి బోండాల కత్తి, కోడి కత్తి, కట్టర్‌, ఫోల్డింగ్‌ బ్లేడ్‌, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నాం అని, మాట్లాడుకుందామని పిలిపించుకుని కళ్లలో కారం కొట్టుకుని ఘర్షణకు దిగారు అని, దాని గురించి తెలిసి అక్కడికి పోలీసులు వెళ్లేసరికి గొడవ పూర్తయ్యింది అని తెలిపారు.

శ్రీధర్‌తో వివాదంలో బుట్టా నాగబాబును ప్రదీప్‌ ఆశ్రయించాడు. నాగబాబు, ప్రదీప్ ‌రెడ్డి, శ్రీధర్, తోటా సందీప్, పండు కలుసుకున్నారు. తాను రాజీ చేయడానికి వచ్చిన సెటిల్‌మెంట్ విషయంలో నువ్వు ఎందుకు వచ్చావని పండుని ఫోన్‌లో సందీప్‌ నిలదీశాడు.అర్థరాత్రి అనుచరులతో వెళ్లి పండు తల్లితో సందీప్‌ గొడవపడ్డాడు. సందీప్‌ షాప్‌ వద్దకు వెళ్లి వర్కర్లపై పండు దాడి చేశాడు. విషయం తెలుసుకున్న సందీప్.. పండుకు ఫోన్ చేసి సవాల్‌ విసిరాడు. తోటావారి వీధిలో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. గ్యాంగ్‌వార్‌లో సందీప్‌ చనిపోయాడు అని తెలిపారు. ఇదంతా కూడా కేవలం 7 సెంట్ల భూమి కోసం జరిగింది అని అయన తెలిపారు. సందీప్‌ మీద 13 కేసులు ఉన్నాయి, పండుపై 3 కేసులు ఉన్నాయి. 2016లో సందీప్‌ మీద ఉన్న రౌడీషీట్‌ని మూసివేశాం’ అని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.