Begin typing your search above and press return to search.

పచ్చి భూతులతో బాబు, పవన్ పై విరుచుకుపడిన వైసీపీ ఎమ్మెల్యే !

By:  Tupaki Desk   |   11 Jan 2020 9:27 AM GMT
పచ్చి భూతులతో బాబు, పవన్ పై విరుచుకుపడిన వైసీపీ ఎమ్మెల్యే !
X
ప్రస్తుతం ఏపీలో రాజకీయం అట్టుడికిపోతోంది. దీనికి ప్రధాన కారణం మూడు రాజధానుల వ్యవహారం. ఏపీకి మూడు రాజధానులు అయితే , చాలా బాగుంటుంది అని , అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని వైసీపీ ప్రభుత్వం చెప్తుంటే ...అమరావతీ రాజధాని అంటూ టీడీపీ , జనసేన ప్రభుత్వం పై మండిపడుతూ అమరావతి ప్రాంత రైతులు చేసే ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల పచ్చిబూతులు తిడుతూ వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై బూతులతో రెచ్చిపోయారు. వారు ముగ్గురిని బండబూతులతో తిట్టాలని వుంది అంటూనే ఆ బూతులన్నింటిని వాడిపడేసారు. చంద్రబాబు తన బినామీల కోసం మాత్రమే బస్సు యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ వర్గాలను సమాయత్తం చేసే సందర్భంలో చంద్రశేఖర్ బూతులతో ప్రారంభించారు . చంద్రబాబుని లం# కొ##, వె## క# అని తిట్టాలని ఉంది అంటూ ఎమ్మెల్యే తిట్టిపోశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ది చెప్పాం… ఇక స్థానిక సంస్థల్లోను గట్టి దెబ్బ కొడితే ముసలోడు చంద్రబాబు ఇక లేవలేడంటూ రెచ్చిపోయారు.

గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియ జెప్పాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు కొడుకు పప్పు లోకేశ్‌ కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని ఆరోపిస్తూ.. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా ? అంటూ పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక దొం## కొ## అంటూ.. ఒక లం# చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు వైసీపీ ఎమ్మెల్యే. రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలని, అమరావతిలో బినామీలను బయటకు తీయాలని చంద్రశేఖర్ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను జైల్లో వేయాలని డిమాండ్ చేశారాయన. కొంతమంది అయన అన్న మాటలకి ఆయనపై ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేయాలి కానీ , మరీ అంత తీవ్రమైన పదాలని ఉపయోగించడం సభ్యత అనిపించుకోదు అంటూ చర్చించుకుంటున్నారు.