Begin typing your search above and press return to search.
పవన్ పై భారీ శపధం చేసిన ద్వారంపూడి
By: Tupaki Desk | 19 March 2022 5:30 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద భీకర శపధం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో.. ఒక పార్టీ అధినేతను ఉద్దేశించి ఈ తరహా సవాలు చేయటం ఇదే తొలిసారిగా చెప్పాలి. ఈ మధ్యనే ముగిసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ మంత్రులు కొందరి గురించి ఘాటు విమర్శలతో పాటు.. ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపైనా మండిపడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. పవన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్న ఆయన.. జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ అన్యాయం చేస్తున్నారన్నారు. పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడంటూ పవన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో జనసైనికులు బాధ పడే రోజు వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు.. పవన్ ను వెన్నుపోటు పొడవటం ఒక లెక్కనా? అన్న ఆయన ప్యాకేజీలకు అమ్ముడుపోయి.. నేతలకు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దంటూ పవన్ కు హితబోధ చేసినట్లుగా మాట్లాడటం గమనార్హం.
ఈసారి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా(ఏ నియోజకవర్గంలో) సరే తాను ఆయన ఓటమి కోసం పని చేస్తానని శపధం చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకొని పవన్ ను ఓడించటమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. పార్టీ కోసమే పవన్ ను ఓడిస్తానని చెప్పారు. జనసేన కార్యకర్తలకు పవన్ అన్యాయం చేస్తున్నారన్నారు. పవన్ మీద డైరెక్టు అటాక్ అన్నట్లుగా విరుచుకుపడిన ద్వారంపూడి ఘాటు వ్యాఖ్యలకు జనసైనికులు.. జనసేనాని ఎలా రియాక్టు అవుతారో చూడాలి.