Begin typing your search above and press return to search.
పన్నీర్ ను బుగ్గకారుతో కొట్టిన పళని
By: Tupaki Desk | 16 Feb 2017 12:42 PM GMTగడిచిన కొద్దిరోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన తమిళ రాజకీయం ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి ప్రమాణం చేసేశారు. దీంతో.. తమిళనాడుకు మరో ముఖ్యమంత్రి వచ్చినట్లైంది. తన పదవీ ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందే.. తన మంత్రివర్గంలోని వారి వివరాల్ని వెల్లడించిన పళనిస్వామి.. పన్నీర్ సెల్వంకు షాకిచ్చారు.
మొన్నటివరకూ పన్నీర్ వర్గంలో చురుగ్గా వ్యవహరించిన సెంగొట్టియన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా వెల్లడించి సర్ ప్రైజ్ చేశారు. 31 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేసిన పళని స్వామి.. రానున్న రోజుల్లో మరెలాంటి సర్ ప్రైజులు ఎదురుకాకుండా చూసుకోవటమే కాదు.. పన్నీర్ ను ఒంటరిని చేసే వ్యూహాన్ని ఎన్నుకున్నట్లుగా చెప్పాలి.
చిన్నమ్మకు తీరని మనోవ్యధను మిగిల్చిన పన్నీర్ కు చుక్కలు చూపించే కార్యక్రమాన్ని తన ప్రమాణస్వీకారంతోనే చిన్నమ్మ విదేయుడు షురూ చేశారని చెప్పాలి. పన్నీర్ వర్గంలోని నేతలకు పదవులు ఎరవేసేసి.. తమ పక్షాన తీసుకోవటం ద్వారా పన్నీర్ ను ఒక్కడిని చేయటంతో పాటు.. భవిష్యత్తులో మరెలాంటి అవకాశాన్ని మిగల్చకుండా చేయాలన్నదే శశికళ ఆలోచనగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/