Begin typing your search above and press return to search.
తెలంగాణలో ముక్కలేనిదే ముద్దదిగడం లేదే?
By: Tupaki Desk | 29 Nov 2022 1:30 AM GMTతెలంగాణలో మద్యం మాత్రమే కాదు.. మాంసం విక్రయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముక్కలేనిదే ముద్ద దిగని వారు పెరిగిపోతున్నారు. దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలో నాన్ వేజ్ ఎక్కువగా తినేస్తున్నారు. తగ 4 ఏళ్ల లెక్కలు చూస్తే ఇదే తేటతెల్లం చేస్తోంది.
గత 4 ఏళ్లలో తెలంగాణలో 9.75 లక్షల టన్నుల గొర్రె, మేక మాంసం ఉత్పత్తి విక్రయాలు జరిగినట్లు మేకలు,గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఓ నివేదిక అందించింది. జాతీయ వార్షిక మాంసం వినియోగం 5.4 కిలోలు ఉండగా.. తెలంగాణలో మాత్రం ఏకంగా 21.17 కిలోలు ఉందని నివేదిక వెల్లడించింది. ఈ మాంసం మొత్తం విలువ ఏకంగా రూ.58500 కోట్లు అని పేర్కొంది.
తెలంగాణలో మాంసాహార వినియోగం బాగా పెరిగిందని సర్వేలో తేలింది. ముక్కలేనేది ముద్దదిగని వారు చాలా మందే ఉన్నారు. కొందరు ఆదివారాలు ఫుల్లుగా మాంసాన్ని తెచ్చుకొని లాగేస్తే.. ఇంకొందరు ఇతర వారాల్లో కూడా మాంసాహారాన్ని తీసుకుంటున్నారు.
కరోనాకు చెక్ పెట్టాలంటే మాంసాహారం తినాలని వైద్యులు సూచించడంతో అప్పటి నుంచి వీటి వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా చికెన్, మటన్ సెంటర్ల వద్ద ప్రజలు సందడి చేస్తూనే ఉన్నారు. రేటు ఎంతైనా సరే వారానికి ఒకసారైనా మాంసం రుచి చూడాలనుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు.
తాజాగా ఎన్ఎఫ్.హెచ్.ఎస్5 సర్వేలో భాగంగా మాంసాహారం తినేవారిపై సర్వే నిర్వహించారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మొత్తంగా 77 శాతం మంది మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తేలింది. ఇందులో అత్యధికంగా చికెన్, మటన్, ఫిష్ మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దేశ సగటు కంటే చాలా ఎక్కువగా తెలంగాణలో 96శాతం, ఏపీలో 96 శాతం మంది మాంసాహారాన్ని తింటున్నట్లు తేలింది.
అత్యధికంగా లక్షద్వీప్ లో 100శాతం మంది మాంసాన్ని తింటుండగా.. అతి తక్కువగా రాజస్థాన్ లో కేవలం 31శాతం మంది మాత్రమే మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశంతో గత సర్వేతో పోలిస్తే ఈ సారి మాంసం ఆహారం తీసుకునే వారి సంఖ్య తెలంగాణలో బాగా పెరగడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.