Begin typing your search above and press return to search.
ముందస్తు...తధాస్తూ..
By: Tupaki Desk | 23 Oct 2021 12:30 AM GMTముందస్తు అన్నది మాట కాదు మంత్రంగా, రాజకీయ తంత్రంగా వర్తమానంలో కనిపిస్తోంది. ప్రజల మనసు మారకముందే ఏమార్చి మరోసారి అధికార పగ్గాలు అందుకోవడమే ముందస్తు ఎన్నికల మ్యాజిక్. ఈ విషయంలో దేశంలో చాలా రాజకీయ పార్టీలు చాల సార్లు సక్సెస్ అయ్యాయి. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాయి కూడా. ఇక 2019 మేలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఆరు నెలల ముందుకు తీసుకువచ్చి 2018 చివరలో జరిపించుకున్న కేసీయార్ అద్వితీయంగా విజయం సాధించారు. ఈసారి ముందస్తు ముచ్చట్లే లేవు అని కేసీయార్ అంటున్నా విపక్షాల్లో అనుమానాలు మాత్రం పోవడంలేదు. సరే తెలంగాణా సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికల గురించి చర్చలు మాత్రం ఆసక్తికరంగా సాగుతున్నాయి.
వైసీపీ ఒక్కసారిగా దూకుడు పెంచడం, టీడీపీని బలంగా ఢీ కొట్టడం తమ క్యాడర్ మొత్తాన్ని రీచార్జి చేయడం టాప్ టూ బాటమ్ జగన్ నుంచి నేతల వరకూ మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేయడం బట్టి చూస్తే కనుక కచ్చితంగా ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఇవి సన్నాహాలే అంటున్నారు. ముందస్తు ఎన్నికలు ఏపీలో ఎందుకు వస్తాయి అంటే దానికి ఆర్ధిక, సామాజిక రాజకీయ కారణాలు అనేకం ఉన్నాయి. ముందుగా ఆర్ధికం గురించి చెప్పుకుంటే చిల్లు ఖజానా వెక్కిరిస్తోంది. తేవాల్సిన అప్పులు అన్నీ తెచ్చేశారు, లక్షల కోట్లకు పైగా రుణాలు పేరుకుపోయాయి. ఇక కొత్త అప్పులు పుట్టవు, ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు జగన్ సంక్షేమ పధకాలు ఏదో రోజున ఒక్కసారిగా ఆగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అదే జరిగితే రాజకీయంగా అతి పెద్ద దెబ్బ పడుతుంది.
మరో వైపు చూసుకుంటే సామాజికంగా కొన్ని కీలకమైన బలమైన వర్గాలను మచ్చిక చేసుకుని వైసీపీని ఢీ కొట్టాలని విపక్షాలు చూస్తున్నాయి. అందుకోసం అవి చేస్తున్న ప్రయత్నాలు కూడా కాలం గడిచే కొద్దే ఫలించే సూచనలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక రాజకీయంగా చెప్పుకుంటే నిన్న ఉన్న పరిస్థితి నేడూ రేపూ ఉండదు, అందువల్ల దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే తెలివైన వారు చెసే పని. ఏపీలో చంద్రబాబు పని 2019 ఎన్నికలతో అయిపోయింది అనుకుంటే ఆయన బలమైన మీడియా మద్దతుతో పాటు, కొన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ద్వారా గట్టిగా ఢీ కొడుతో జగన్ కి కొరకరాని కొయ్యగా మారిపోయారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీ 151 ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న వైసీపీని అల్లల్లాడిస్తోంది అంటే అది చంద్రబాబు రాజకీయ చాణక్యం తప్ప మరోటి కాదు.
దాంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అంటే బాబు కచ్చితంగా బలపడిపోవడం ఖాయమన్న అంచనాలూ అనుమానాలూ ఏవో వైసీపీ పెద్దల్లో ఉన్నాయని అంటున్నారు. ఇక కరోనా అనంతర పరిస్థితులు కూడా వైసీపీ అనుకున్న కార్యక్రమాలు సాఫీగా అమలు కాకుండా చేశాయని అంటున్నారు. కరోనా మిగిల్చిన లోటు ఇప్పట్లో పోయేది కాదు, అందువల్ల 2024 వరకూ ఇలాగే ఉంటే కచ్చితంగా నెగిటివిటీ దారుణంగా పెరుగుతుంది అనే వైసీపీ భావనగా ఉందని చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత తొందరగా ఎన్నికలకు వెళ్తే తాము అమలు చేసిన పధకాలు, వాటి వల్ల లబ్ది పొందిన వర్గాల మద్దతుతో అయినా మరో మారు అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని వైసీపీ వ్యూహంగా ఉంది. అందుకోసమే జగన్ పార్టీని మొత్తం అలెర్ట్ చేస్తున్నారు అన్న మాట ఉంది. ఇక వచ్చే ఏడాది అంటే సంక్రాంతి పండుగ దాటిన తరువాత జగన్ జనాల్లోకి వస్తారని, అదే టైమ్ లో ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా కూడా వరసబెట్టి సర్వేలు చేయిస్తూ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.