Begin typing your search above and press return to search.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు... అమిత్ షా సంకేతాలు
By: Tupaki Desk | 23 Dec 2021 12:30 AM GMTకేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నిక లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని షా తెలిపారు. ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే కేసీఆర్, కేంద్రంతో యుద్ధానికి దిగినట్టు మేధావులు కూడా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ నేత.. డీకే అరుణ కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచన చూస్తే.. ఆయన ముందస్తుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కూడా వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే అమిత్ షా కూడా బీజేపీ నేతలకు సరైన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వంపై యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క శక్తిగా కేసీఆర్‌పై పోరు సాగించాలని సూచించారు. బలమైన సామాజిక వర్గాలు.. బలమైన గళాలు వినిపించే నాయకులను అక్కున చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే కేసీఆర్‌పై పోరాడండి.. అని అమిత్ షా.. తన పార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించేలా వారికి డైరెక్షన్ చేశారు. కేసీఆర్ ఒక్కరే ప్రత్యర్థి అని.. ఇతర పార్టీలపై కన్నా.. టీఆర్ ఎస్‌ను టార్గెట్ చేయాలని.. ఆయన సూచించినట్టు తెలిసింది.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికలపై గట్టి వ్యూహంతోనే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసససభ్యుల టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్ సరికొత్తగా ముందుకు వెళ్లనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్‌ఎస్‌పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్‌కు ఈసారి నో ఛాన్స్ చేప్పే అవకాశముందనే టాక్ వస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో టీఆర్ ఎస్ భవన్‌లోనూ.. చర్చ సాగుతోంది.
టికెట్‌దక్కని సిట్టింగ్స్‌లో తమ పేరు ఉంటుందేమో అనే ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకీ ఎక్కువవుతున్నట్లు నియోజకవ ర్గాల్లోనూ ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి కీలక నేతల వరకు అందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. ఏం జరిగినా ఫర్వాలేదు.. ఎవరు ఉన్నా పోయినా.. ఫర్వాలేదు అనే ధోరణిలో కాకుండా.. టికెట్లు దక్కని వారిని కూడా పార్టీలోక లుపుకొని పోయేలా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు బీజేపీ ఇటు టీఆర్ ఎస్ కూడా తెలంగాణలో ముందస్తు వ్యూహాన్ని బాగానే అమలు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.